అర్రె.. రవితేజ ఇక్కడ దొరికేశాడుగా..?
ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా - నేనా అన్నట్టుగా రవి - విజయ్ లు తమ సినిమాలతో పోటీకి దిగారు. ముందుగా రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ శుక్రవారం రోజు రిలీజ్ అయింది. తరువాత రోజు అంటే నిన్న విజయ్ ‘టాక్సీవాలా’ రిలీజ్ అయింది. రెండు సినిమాల మీద పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఎవరిని ఎవరు దెబ్బ తీస్తారనే చర్చే లేకపోయింది.
‘అమర్ అక్బర్ ఆంటోని’ మొదటి ఆటతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ చిత్రం తొలిరోజే ఓపెనింగ్స్ పడిపోయాయి. మొదటి రోజే సినిమా పరిస్థితి ఏంటో తేలిపోగా అందరి ఫోకస్ ‘ట్యాక్సీవాలా’ మీదికి షిఫ్టయింది. చాలా ఇబ్బందులు మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ‘అమర్ అక్బర్ ఆంటోని’ అక్టోబర్ 5న రిలీజ్ కావాల్సివుంది. కానీ అదే రోజు విజయ్ ‘నోటా’ సినిమా ఉండటంతో ఎందుకులే పోటీ అని డేట్ మార్చుకున్నారు మేకర్స్. కానీ వీరిద్దరి మధ్య పోటీ తప్పలేదు.
గంటల గ్యాప్ తో విజయ్ తన ‘టాక్సీవాలా’ ను రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. అయితే ఈ సినిమా మరీ అంత గొప్పగా ఏమి లేదు. ఒకసారి చూడొచ్చు. విజయ్ క్రేజ్ వల్ల దీనికి బుకింగ్స్ బాగానే జరిగాయి. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. వసూల్ కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద రవి అక్టోబర్ 5 న మిస్ అయినా ఇక్కడ దొరికేశాడు.
By November 19, 2018 at 04:47AM
No comments