Breaking News

లీకైతే ఏంటి.. కొట్టాడుగా హిట్టు..!!


కెరీర్ లో చాలా ఫాస్ట్ గా స్టార్ హోదానందుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ... అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అర్జున్ రెడ్డి హిట్ తోనే విజయ్ దేవరకొండ స్టయిల్, లుక్స్, యాటిట్యూడ్ అన్ని మారిపోయాయి. ఆ సినిమా తర్వాత మళ్ళీ గీత గోవిందం సినిమాతో సింప్లి సూపర్బ్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అర్జున్ రెడ్డి లో అదరగొట్టే యాటిట్యూడ్ తో నేచురల్ గా ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ.. గీత గోవిందంతో డీసెంట్ నటనతో 100  కోట్ల హీరో అయ్యాడు. కాకపోతే తమిళ్ లో కూడా హీరోగా చక్రం తిప్పుదామనుకుని.... నోటా సినిమాతో చేతులు కాల్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలోనే... పొలిటికల్ బ్యాగ్డ్రాప్ మూవీ చేసి హిట్ కొట్టాలనుకుంటే అది కాస్త తేడా కొట్టింది. 

గీత గోవిందం, నోటా సినిమాలకన్నా ముందే టాక్సీవాలాతో రావాల్సిన విజయ్ ఒక బ్లాక్ బస్టర్ ఒక ప్లాప్ తర్వాత ఈ టాక్సీవాలాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. టాక్సీవాలా షూటింగ్ మూడు నెలల క్రితమే కంప్లీట్ అయినా.. గ్రాఫిక్స్ పనులతో విడుదల లేట్ అవుతూ రావడం.. మధ్యలో సినిమా మొత్తం పైరసీ అవడంతో టాక్సీవాలా మీద ప్రేక్షకులలోనే కాదు విజయ్ దేవరకొండ లోను హోప్స్ పోయాయి. కానీ నిర్మాతను గట్టెక్కించాలని విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ డిఫ్రెంట్ గా చేసి మరీ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. మరి విజయ్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తేవడానికి తన వంతు కన్నా ఒకింత ఎక్కువే కష్టపడ్డాడు.

మరి విజయ్ కష్టం ఊరికే పోలేదు. దర్శకుడు రాహుల్ ఈ సినిమాని థ్రిల్లర్ కామెడీతో నిలబెట్టేశాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాని హిట్ ట్రాక్ ఎక్కించాడు. అన్నిటికన్నా ఈ సినిమాని విజయ్ దేవరకొండ నటన నిలబెట్టింది. విజయ్ దేవరకొండ నేచురల్ నటనతో అదరగొట్టాడు. కాస్త రొటీన్ కి భిన్నంగా విజయ్ స్టయిల్ ఉంది కానీ.. మిగతాదంతా సూపర్. అలాగే ఈ సినిమాకి ఆయువుపట్టు నేపధ్య సంగీతం. జాక్స్ బెజోయ్ అందించిన మ్యూజిక్ లోని ఒక పాట, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఇక సుజిత్ సారంగ్ కెమెరా గొప్పదనం ప్రతి ఫ్రేమ్ లోను కనబడింది.

ఇంకా ఈ సినిమాలో కామెడీ టచ్ మాత్రం అదిరింది. మరి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న  ఈ సినిమాని రివ్యూ రైటర్స్ కూడా మంచి మార్క్ లేసి పాస్ చేసేశారు. అంటే విజయ్ కి మళ్ళీ హిట్ కట్టబెట్టేశారు. అయితే ఈ సినిమాలో మైనస్ లు కూడా లేకపోలేదు. స్లో నేరేషన్, ఎడిటింగ్, సెకండ్ హాఫ్ లో ఉన్న సీరియస్ నెస్ కాస్త సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ కాకుండా ఆపాయి కానీ.. లేదంటే టాక్సీవాలాతో విజయ్ దేవరకొండ మళ్ళీ గురి చూసి బ్లాక్ బస్టర్ కొట్టేసేవాడే.



By November 19, 2018 at 04:50AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43549/vijay-deverakonda.html

No comments