Breaking News

ఈ కుర్రహీరోకి కూడా చిరునే స్ఫూర్తి..!


కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన యువహీరో నవీన్‌చంద్ర. ఈయనకు మొదట తమిళ చిత్రంలో అవకాశం వచ్చింది. కానీ ఆ చిత్రం విడుదల కాలేదు. అదే సమయంలో ఆయన హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'అందాలరాక్షసి' చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ద్వారానే నవీన్‌చంద్ర, హనురాఘవపూడి, లావణ్యత్రిపాఠి వంటి వారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన 'సంభవామి యుగేయుగే, త్రిపుర, దళం, లచ్చిందేవికో లెక్కుంది', నాని హీరోగా నటించిన 'నేను లోకల్‌' చిత్రంలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలను కూడా చేశాడు. 'జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌, భం భం బోలేనాథ్‌, మీలో ఎవరు కోటీశ్వరుడు' తదితర చిత్రాలలో నటించాడు. 

తాజాగా ఆయన మాట్లాడుతూ తనకి సినీ నటుడు కావడానికి ప్రేరణ చిరంజీవి అని చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. అలా ఓసారి చిరంజీవి నటించి 'ముఠామేస్త్రి' చిత్రానికి వెళ్లాను. ఆ సినిమాలో చిరంజీవి సైకిల్‌పై ఎంట్రీ ఇస్తాడు. ఆ సీన్‌ ఎందుకనో నన్ను బాగా ప్రభావితుడని చేసింది. నేను కూడా హీరో కావాలని అనిపించింది. అది నాతో పాటు పెరుగుతూ పెద్దదైంది. అప్పటి నుంచి నా ఆలోచనలు అలానే సాగుతూ వచ్చాయి. హైదరాబాద్‌ వస్తే స్టూడియోల చుట్టు తిరిగేవాడిని. మొత్తానికి కొంత కాలం తర్వాత నా ప్రయత్నాలు ఫలించాయి. 'అందాల రాక్షసి' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాను. నాకు నచ్చిన ఎంతో ఇష్టమైన నా కోస్టార్‌ కలర్స్‌ స్వాతి గారు అని చెప్పుకొచ్చాడు.



By November 05, 2018 at 11:42AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43356/chiranjeevi.html

No comments