Breaking News

మీరు జస్ట్‌ అలా కనిపిస్తే చాలన్నాడు: రజినీ


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘2.0’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ చిత్రానికి సీక్వెల్‌గా ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, కరణ్‌ జోహర్‌ సమర్పణలో సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా త్రిడి ఫార్మాట్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా ‘2.0’ కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్‌లో సౌండ్‌ డిజైన్‌ చేయడం మరో విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్‌ 3న చెన్నైలో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘‘ఆల్‌ ఇండియా మీడియాను ఒక రూఫ్‌ కింద చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది. సుభాష్‌కరణ్‌కి, శంకర్‌కి అడ్వాన్స్‌ కంగ్రాట్స్‌. నిర్మాత 600 కోట్లు పెట్టారు. శంకర్‌ని నమ్మి పెట్టారు. అంతేగానీ నామీదో, అక్షయ్‌కుమార్‌ మీదో కాదు. ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌, నిర్మాతల ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎప్పుడూ రీచ్‌ అవుతూనే ఉన్నారు శంకర్‌. కొన్నిసార్లు తప్పి ఉండవచ్చు. అయినా అతను మెజీషియన్‌. అతను చాలా గొప్ప డైరక్టర్‌. ఏదో రూ.600కోట్లు పెట్టినంత మాత్రాన ఈ సినిమా హిట్‌ అని నేను చెప్పడం లేదు. అందరూ కష్టపడతారు. అయినా అన్నిసార్లు వర్కవుట్లు కావు. కొన్నిసార్లు ఏవో మేజిక్‌లు వర్కవుట్లు అవుతాయి. ఈ సినిమాలో అలాంటి మేజిక్‌లున్నాయి. ఈ సినిమాకు మోర్‌ ప్రమోషన్లు అవసరం లేదు. అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రమోట్‌ చేస్తారు. మంచికి తోడుగా ఉండే మీడియా తప్పకుండా ఎంకరేజ్‌ చేస్తారు. చిల్డ్రన్‌కీ, ఇంటలెక్చువల్స్‌ కీ, సూడో ఇంటలెక్చువల్స్‌కీ నచ్చుతుంది. ఇందులో అన్ని అంశాలున్నాయి. 

ఈ విశ్వం మానవులకు మాత్రమే కాదు. పశుపక్ష్యాదులకు కూడా. అలాంటి పలు విషయాలను, సందేశాత్మకంగా చెప్పారు శంకర్‌. పర్యావరణాన్ని, సొసైటీని మోడ్రన్‌ టెక్నాలజీ ఎలా స్పాయిల్‌ చేస్తుందో ఇందులో చాలా బాగా చెప్పారు. శంకర్‌గారు ఏమనుకున్నారో దాన్ని తేగల సత్తా ఆయనకుంది. అందుకే ఆయన కథ చెప్పినప్పుడు ‘ఇదెలా వర్కవుట్‌ అవుతుంది?’ అని గానీ, ఇంకేమీ గానీ అడగలేదు. ఎవరు నిర్మిస్తున్నారు అని మాత్రం అడిగాను. ‘శివాజీ’ చేసేటప్పుడు ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్‌ కన్నా రెట్టింపయింది. విడుదల సమయంలో ఇంకా ఎక్కువైంది. కానీ ఆ సినిమాకు అంత కన్నా ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. ‘శివాజీ’ ఎంత కలెక్ట్‌ చేసిందో, అంత బడ్జెట్‌ వేశారు ‘రోబో’కి. సన్‌ పిక్చర్స్‌ వాళ్లు.. దానికన్నా 20-30 పర్సెంట్‌ బడ్జెట్‌ ఎక్కువయింది. అయినా కలెక్ట్‌ అయింది. 'రోబో' కలెక్ట్‌ చేసినంత ఈ సినిమాకు వస్తే చాలు అని ‘2.0’ మొదలుపెట్టాం. అందుకే ముందు రూ.300కోట్లు అనుకున్నాం. ఇప్పుడు డబుల్‌ అయింది. తప్పకుండా అంతకు డబుల్‌ కలెక్ట్‌ చేస్తుంది. 'కబాలి' ఒక షెడ్యూల్‌ చేసిన తర్వాత నాకు అనారోగ్యం వచ్చింది. ‘2.0’ కోసం 5 రోజులు షూట్‌ చేశా. 7, 8 రోజులైంది. అప్పటికే నాకు ఆత్మవిశ్వాసం పోయింది. 'నేను జస్టిఫై చేయలేను. ఖర్చుపెట్టిందంతా ఇచ్చేస్తాను. నేను చేయలేను' అని శంకర్‌ని పిలిచి చెప్పా. 'మీరు జస్ట్‌ అలా రండి. మీరు కన్ను చూపించండి.. మిగిలింది మొత్తం మనం చేద్దాం' అని అన్నారు. 

బాడీ సూట్‌ వద్దు అని అన్నారు. కానీ నేనే.. ఆ బాడీ సూట్‌ నేను వేసుకుంటా అని అన్నాను. 'కబాలి' కోసం మలేషియాకి వెళ్లినప్పుడు ఆరోగ్యం ఇంకా చాలా పాడయింది. అప్పుడు డాక్టర్‌ నాలుగైదు నెలలు రెస్ట్‌ కావాలన్నారు. ఆ విషయం నిర్మాతకు తెలిసి మా ఇంటికి వచ్చి 'నాలుగు నెలలు కాదు, నాలుగు సంవత్సరాలు వెయిట్‌ చేస్తా. నాకు డబ్బులు కాదు. మీతో సినిమా ముఖ్యం' అని అన్నారు. అలాంటి ఒక ఫ్రెండ్‌ దొరకడం, ఓ కోహినూర్‌ డైమండ్‌ దొరికినట్టు. ఈ ప్రపంచంలో నాకు మంచి ఫ్రెండ్‌ దొరికారు. శంకర్‌ త్వరలో కమల్‌హాసన్‌తో చేసే ‘ఇండియన్‌ 2’ చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమా చాలా లేట్‌ అయింది, ఎందుకు లేట్‌ అయింది అని చాలా మంది అడిగారు. కానీ కాస్త లేట్‌ అయినా, కరెక్ట్‌గా రావాలి. వస్తే, ష్యూర్‌గా కొట్టాలి. నేను.. సినిమా గురించి చెప్పాను. సినిమా గురించి మాత్రమే చెప్పా. ప్రజలు నమ్మారు. హిట్‌ అని నిర్ణయించారు. రిలీజ్‌ చేయడమే బాకీ. ఈ సినిమాను, తమిళ్‌ ఇండస్ట్రీని ప్యాన్‌ ఇండియా స్థాయిని మించి ఇంటర్నేషనల్‌ స్థాయికి తీసుకెళ్లారు శంకర్‌. శంకర్‌, రాజమౌళి, రాజ్‌కుమార్‌ హిరానీ లాంటివారు జెమ్స్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ. వాళ్లందరినీ చాలా గొప్పగా చూసుకోవాలి. నీరవ్‌ షా చాలా ఈజ్‌తో చేశారు. నీరవ్‌షా చూడ్డానికి, ఆయన చేసే పనికీ సంబంధమే ఉండదు. ఎమీ జాక్సన్‌ మొత్తం ఆ సూట్‌లోనే ఉండేవారు. అక్షయ్‌కుమార్‌కి హ్యాట్సాఫ్‌. ఆయన్ని ఢిల్లీలో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆస్కార్‌ రెహ్మాన్‌కే ఈ సినిమా రీరికార్డింగ్‌ చేయడం చాలా ఛాలెంజ్‌. అసిస్టెంట్‌ డైరెక్టర్లు పడ్డ కష్టం చాలా గొప్పది. శంకర్‌గారు చాలా గొప్ప స్థాయికి వెళ్లాలి’’ అని అన్నారు. 



By November 05, 2018 at 11:33AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43355/rajinikanth.html

No comments