Breaking News

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: మరో సంచలన వార్త!!


బాలయ్య నిర్మించ తలపెట్టిన ‘యన్.టి.ఆర్’కు పోటీగా.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే బాలయ్య ఫుల్ స్పీడ్‌గా ‘యన్.టి.ఆర్’ని పరుగులు పెట్టిస్తుంటే, వర్మ మాత్రం తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం ఇంకా ఆర్టిస్ట్‌లను వెతికే పనిలోనే ఉన్నాడు. అయితే వర్మ.. సెలైంట్‌గా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ షూటింగ్‌ను యాభై శాతం పూర్తి చేశాడని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇక బాలయ్య తన ‘యన్.టి.ఆర్’ గురించి రోజుకో అప్‌డేట్‌తో సంచలనం సృష్టిస్తుంటే.. నేనెందుకు కామ్‌గా ఉండాలని వర్మ భావించినట్లు ఉన్నాడు. వాస్తవానికి వర్మ లైన్‌లోకి దిగితే.. ఇప్పటి వరకు బాలయ్య ‘యన్.టి.ఆర్’ కోసం చేసిన హడావుడి మొత్తం మరిచిపోయేలా చేయగలడు. అంతటి సమర్ధుడు వర్మ. కానీ వర్మ ఇప్పుడప్పుడే ఎందుకు అన్నట్లుగా.. చిన్న చిన్న విషయాలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సినిమాలో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ అద్భుతమైన పాటను పాడారంట. దైవత్వంతో కూడిన ఈ పాట సినిమా అంతా ఉండి.. చూసే ప్రేక్షకుడిని హంట్ చేస్తుందని చెబుతున్నారు. కల్యాణ్ మాలిక్ నేతృత్వంలో ఈ పాట రికార్డింగ్ చేయడం పూర్తయిందని, ఈ కలయికను అస్సలు ఊహించలేదని, సింగర్స్‌లోనే గ్రేట్ సింగర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో పార్ట్ అయినందుకు ధన్యవాదాలు అంటూ వర్మ పోస్ట్ చేశాడు. దీంతో మరోసారి వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని వార్తల్లో నిలిపాడు.



By November 14, 2018 at 11:56AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43491/sp-balu.html

No comments