2.O కోసం 25 టీమ్స్ పనిచేశాయట..!
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘2.0’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ చిత్రానికి సీక్వెల్‌గా ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, కరణ్ జోహర్ సమర్పణలో సుభాష్ కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా త్రిడి ఫార్మాట్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా ‘2.0’ కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్‌లో సౌండ్ డిజైన్ చేయడం మరో విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్ 3న చెన్నైలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎడిటర్ ఆంటోనీ మాట్లాడుతూ..‘‘శంకర్‌గారితో ఐదు సినిమాలు చేయడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
వీఎఫ్‌ఎక్స్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. ‘‘అసాధ్యమైన విషయాలనే శంకర్‌గారు ఆలోచిస్తారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించి శంకర్‌గారికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. చాలా ఎక్కువ గైడ్ చేసేవారు. 25 టీమ్స్‌గా మేం చేశాం. వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు అన్నిటికీ థ్యాంక్స్. రజనీగారికి, అక్షయ్‌గారికి, రెహమాన్‌గారికి ధన్యవాదాలు. రసూల్‌గారు 4డీ సౌండ్ చేయడం చాలా గొప్ప విషయం’’ అని అన్నారు.
యాక్షన్ సిల్వ మాట్లాడుతూ.. ‘‘శంకర్ సార్ శిల్పిలాంటివాడు. ప్రతి సీన్‌నీ చెక్కాలనుకుంటారు. ఆయనతో నేను శివాజీకన్నా ముందు ఓ సినిమా, శివాజీ చేశాను. అప్పట్లో నేను పీటర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నాను. నన్ను మాస్టర్‌ని చేసి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రజనీసార్ చాలా చిన్న వ్యక్తుల నుంచి కూడా నేర్చుకోవాలనే స్వభావం ఉన్న వ్యక్తి. ఆయనకు నాలుగు కుట్లు పడేంత గాయమైనప్పటికీ వాటన్నిటినీ పట్టించుకోకుండా షూటింగ్ చేశారు. అక్షయ్‌కుమార్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ముంబైలో స్టంట్ యూనియన్‌కు ఆయనే ఇన్సూరెన్స్ చేసిచ్చారు’’ అని అన్నారు.
కెమెరామెన్ నీరవ్ షా మాట్లాడుతూ.. ‘‘2డీలో సినిమా తీసి త్రీడీకి మారిస్తే అంత నాణ్యత కనిపించదు. అలాగని త్రీడీలో తీయడం కూడా సులభం కాదు. చాలా కష్టతరమైన అంశం. ఈ సినిమా విషయంలో నాకు చాలెంజ్ కన్నా లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ ఎక్కువగా అనిపించింది. కథ విన్నప్పుడు తల ఊపానుకానీ, ప్రయాణంలోనే ఎక్కువ నేర్చుకున్నా’’ అని అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్ మాట్లాడుతూ.. ‘‘నా సినిమా కెరీర్‌లో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్. త్రీడీ కోసం చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. చాలా నేర్చుకున్నా. రజనీకాంత్‌గారి ఫ్యాన్ అయిన నేను ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నా అసిస్టెంట్లు చాలా కష్టపడ్డారు. అందరికీ ధన్యవాదాలు. టీమ్‌కి కృతజ్ఞతలు. ఈ సినిమా కథ వినగానే ముందు ఈ సినిమా ప్రాపర్టీస్ చేశాం. రోబోటిక్ ఆర్మ్స్ చేశాం. ఇన్‌సెట్స్‌లో బర్డ్ వంటివన్నీ, నెమలి వంటివన్నీ చేశాం. చాలా ఆర్మీ ట్యాంకర్లు, స్ట్రైకర్లు వంటివన్నీ చేశాం. దాదాపు ఏడాదిన్నర మెషిన్లు చేశాం. వీటితో సెట్‌కి సంబంధం లేవు. కేవలం రెండు టీమ్‌లు దీనికోసమే పనిచేశాయి..’’ అని అన్నారు.
By November 05, 2018 at 07:35AM
No comments