‘భారతీయుడు 2’.. విలన్ మారాడండోయ్!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjp4TLyig_nEqs_Vw14yakibdnJDEa_SVFyepBQehdlXJnYT4bN8PRAccvKkZ0PLfHA6NslSNq6O9uKMQYJBaAk7jqVOBeKVk4K_YiZ-NjtmrAXClr6fmWOVGwpv_58zHzKTFPck8h2FSo/s400/tollywood.png)
శంకర్ - రజని కాంబోలో వస్తున్న ‘2.ఓ’ చిత్రం మరో తొమ్మిది రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. రజిని సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ది చాలా బలమైన పాత్ర అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
ఈ నేపధ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఈ పాత్ర మరింత మంచి పేరును తీసుకొస్తుందని అనుకుంటున్నా అని చెప్పాడు. మరి అక్షయ్ పాత్ర ఇందులో ఎలా ఉండబోతుందో మరికొన్ని రోజుల్లో తెలియనుంది. శంకర్ కు అక్షయ్ యాక్టింగ్ నచ్చిందేమో మరి తన నెక్స్ట్ మూవీలో కూడా ఛాన్స్ ఇచ్చాడు.
శంకర్ ‘2.ఓ’ తరువాత కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ ని తీయబోతున్నాడని తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ ని తీసుకోవాలని శంకర్ భావిస్తున్నాడట. నిజానికి మొదట విలన్ పాత్రకి గాను అజయ్ దేవగణ్ ను అనుకున్నారు. కానీ అతని డేట్స్ సెట్ అవ్వక ఆయన ప్లేస్ లో అక్షయ్ ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అక్షయ్ కూడా ఓకే చెప్పడంతో శంకర్ తన పాత్రను డిజైన్ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ ప్రకటన అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
By November 21, 2018 at 01:46PM
No comments