Breaking News

VALMIKIPURM PAVITROTSAVAMS FROM OCTOBER 23-25_ వాల్మీకిపురం శ్రీ‌ప‌ట్టాభిరామ‌స్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ


Tirupati, 16 October 2018: The annual Pavitrotsavams of Sri Pattabhirama Swamy Temple in Valmikipuram will be observed from October 23-25.

TTD sub temples Deputy Executive Officer Sri Dhananjeyulu released the wall posters on Tuesday at the Kalyan Mandapam of Sri Kalyana Venkateswara temple in Srinivasa Mangapuram.

As a part of the festival, the Ankurarpanam ritual will be held on October 22. The Vedic rituas of Pavitra Prathishta and Pavitra Samarpana will be held October 22 and 23. And on last day on October 25, veedhi utsavam and Purnahuti will be performed.

Grihastas can take part in this fete, on payment of Rs.300 per ticket on which two persons will he allowed.




ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వాల్మీకిపురం శ్రీ‌ప‌ట్టాభిరామ‌స్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

తిరుపతి, 2018 అక్టోబరు 16: టిటిడికి అనుబంధంగా ఉన్న‌ వాల్మీకిపురంలోని శ్రీ‌ప‌ట్టాభిరామ‌స్వామివారి ఆలయంలో అక్టోబరు 23 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ ధనంజయులు అవిష్కరించారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.

ఇందులో భాగంగా అక్టోబరు 22వ తేదీన అంకురార్పణంతో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 23న పవిత్రప్రతిష్ఠ, రెండో రోజు అక్టోబరు 24న పవిత్ర సమర్పణ, చివరిరోజు అక్టోబరు 25న వీధి ఉత్సవం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధమని, యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక జరిగే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ లక్ష్మయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ రమణయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కేదారేశ్వర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



By TTD News October 16, 2018 at 03:19PM


Read More http://news.tirumala.org/valmikipurm-pavitrotsavams-from-october-23-25/

No comments