POSTERS RELEASED_ తరిగొండ శ్రీ లక్ష్మినరసింహస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు అవిష్కరణ
Tirupati, 2 October 2018: In connection with Pavirtotsavams at Tarigonda Sri Lakshmi Narasimha Swamy from October 9 to 11, DyEO Sri Dhananjeyulu released the posters in Srinivasa Mangapuram temple on Tuesday.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తరిగొండ శ్రీ లక్ష్మినరసింహస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు అవిష్కరణ
తిరుపతి, 2018 అక్టోబరు 02: టిటిడి అనుబంధ ఆలయమైన చిత్తూరు జిల్లా తరిగొండ శ్రీ లక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో అక్టోబరు 9 నుండి 11వ తేదీ వరకు పవిత్రోత్సవాల గోడపత్రికలను టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈ””వో శ్రీ ధనంజయులు అవిష్కరించారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.
ఇందులో భాగంగా అక్టోబరు 8వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.
పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 9వ తేదీన ఉదయం 9.00 నుండి 1.00 గంట వరకు చతుస్థానార్చన, హోమం, పవిత్రప్రతిష్ఠ, స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండోరోజు అక్టోబరు 10వ తేదీన ఉదయం నిత్యహోమము, పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు అక్టోబరు 11వ తేదీన ఉదయం 6.00 నుండి 10.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర విసర్జన, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ లక్ష్మయ్య, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కేదారేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
By TTD News October 02, 2018 at 04:01PM
Read More
No comments