POSTER RELEASED_ శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల గోడపత్రికలు అవిష్కరణ
Tirupati, 2 October 2018: The posters related to Sri Kamakshi Ammavari Utsaham was released by DyEO Sri Subramanyam in Kapileswara Swamy temple on Tuesday. This fete will be observed from October 10 to 19.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల గోడపత్రికలు అవిష్కరణ
తిరుపతి, 2018 అక్టోబరు 02: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో అక్టోబరు 10 నుండి 19వ తేదీ వరకు జరుగనున్న శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల గోడపత్రికలను స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీసుబ్రమణ్యం అవిష్కరించారు. శ్రీ కపిలేశ్వరాలయంలో మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.
ఇందులో భాగంగా శ్రీకామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్త తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 9న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్టోబరు 11న శ్రీ కామాక్షి దేవి, అక్టోబరు 12న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 13న శ్రీ అన్నపూర్ణాదేవి, అక్టోబరు 14న శ్రీ ఆదిపరాశక్తి, అక్టోబరు 15న మావడి సేవ, అక్టోబరు 16న శ్రీ లక్ష్మీదేవి, అక్టోబరు 17న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 18న మహిషాసురమర్థిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 19న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
By TTD News October 02, 2018 at 04:10PM
Read More
No comments