Breaking News

PLASTIC BAN WILL BE STRICTLY OBSERVED FROM NOVEMBER IN TIRUMALA _ తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి దుకాణదారులు సహకరించాలి – టిటిడి ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట


Tirumala, 25 October 2018 : All the commercial establishments in Tirumala should co-operate with TTDs decision of banning the usage of plastic covers from November 1 onwards said TTD Health and Estate officers.

A meeting was organiseren in Astana Mandapam at Tirumala on Thursday where the Health Officer Dr Sermista cautioned all the hoteliers, shop keepers etc.to strictly put a block on the usage of plastic cover which are less than 51microns in thickness. Failing which, will be charged with a penalty between Rs.1000 to 25000, she said.

While Tahsildar Sri Srinivas said, it is the right time to put an end to the plastic usage. Unless we do this we will be destroying the future of our children by giving them an unhealthy living. He said, if the plastic covers are less than the specified measurement, then it will take nearly 10 to 1000 years to dissolve in earth. This will ultimately result in toxicating the nature, he observed.

Health department unit officers, sanitary inspectors, shop keepers were also present.







ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి దుకాణదారులు సహకరించాలి – టిటిడి ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట

అక్టోబ‌రు 25, తిరుమల 2018; ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలను ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నార‌ని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు దుకాణదారులు, హోటల్ యజమానులు సహకరించాలని టిటిడి ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట కోరారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం దుకాణదారులు, హోటల్ యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆరోగ్యశాఖాధికారి మాట్లాడుతూ నవంబర్ ఒకటో తేదీ నుండి తిరుమ‌ల‌లో అందరూ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిలిపివేయాలన్నారు. బొరుగులు, కలకండ, ఖర్జూరం, ఇతర తినుబండారాలు, బొమ్మలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి విక్రయించరాదన్నారు. హోటళ్లో ప్లాస్టిక్ కప్పులు, చెంచాలు వాడ‌కూడదన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారికి ఐదు వేల నుండి 25 వేల వరకు జరిమానా తో పాటు దుకాణం లైసెన్సును ర‌ద్దు చేస్తామన్నారు. వినియోగించిన ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను తిరిగి సేక‌రించ‌క‌పోతే మ‌ట్టిలో క‌ల‌వ‌కుండా భూమి పై పొర‌ల్లోనే ఉండిపోతాయ‌ని, ఈ కార‌ణంగా భూమి వేడెక్కుతుంద‌ని, పంటలు పండ‌వ‌ని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వ‌ల్ల థైరాయిడ్‌, డ‌యాబెటిస్‌, సంతాన‌లేమి స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌న్నారు.

టిటిడి రెవెన్యూ విభాగం తహసీల్దార్ శ్రీ శ్రీనివాసులు మాట్లాడుతూ అక్టోబరు 2న గాంధీ జయంతి నాటి నుంచి తిరుపతిలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించినట్లు తెలిపారు. ఇదేతరహాలో తిరుమలలోనూ ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను నిషేధించాలని టిటిడి ఉన్నతాధికారులు ఆదేశించినట్టు చెప్పారు. అంద‌రూ స‌హ‌క‌రిస్తేనే ప్లాస్టిక్ నిషేధం సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ప్లాస్టిక్ వ‌ల్ల క‌లిగే దుష్ఫ‌రిణామాల‌ను వివ‌రించారు. ప్లాస్టిక్ క‌వ‌ర్లు మ‌ట్టిలో పూర్తిగా క‌లిసేందుకు 10 సంవ‌త్స‌రాల నుండి వెయ్యి సంవ‌త్స‌రాలు, వాట‌ర్ బాటిల్ భూమిలో క‌లిసేందుకు 450 సంవ‌త్స‌రాల కాలం ప‌డుతుంద‌న్నారు. భార‌త‌దేశంలో రోజుకు 25 వేల ట‌న్నుల ప్లాస్టిక్ వ్య‌ర్థాలు పోగ‌వుతున్నాయ‌ని, వీటిని తిరిగి పూర్తిగా సేక‌రించి రీసైక్లింగ్ చేయాల‌ని, లేనిప‌క్షంలో ప‌ర్యావ‌ర‌ణంపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని వివ‌రించారు. ప్లాస్టిక్ క‌ప్పులు, క‌వ‌ర్లు, ప్లేట్ల‌లో ఆహార ప‌దార్థాలు తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి యూనిట్ ఆఫీస‌ర్ శ్రీ శ్రీ‌నివాస‌మూర్తి, సీనియ‌ర్ శానిట‌రీ ఇన్స్‌పెక్ట‌ర్లు శ్రీ న‌ర‌సింహారావు, శ్రీ కృష్ణ‌య్య‌, శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ‌, శానిట‌రి ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ భాస్క‌ర్‌, శ్రీ ల‌క్ష్మ‌య్య‌, శ్రీ‌మ‌తి శ‌కుంత‌ల‌, శ్రీ‌మ‌తి వేద‌వ‌ళ్లి, శ్రీ ముర‌ళి, శ్రీ కుల‌శేఖ‌ర్, 150 మందికిపైగా దుఖాణ‌దారులు, హోట‌ళ్ల నిర్వాహ‌కులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



By TTD News October 25, 2018 at 05:59PM


Read More http://news.tirumala.org/plastic-ban-will-be-strictly-observed-from-november-in-tirumala/

No comments