Breaking News

స‌నాత‌న ధార్మిక విజ్ఞాన ప‌రీక్ష‌ల విజేత‌ల‌కు అక్టోబ‌రు 27 నుండి ఆయా ప్రాంతాల్లో బ‌హుమ‌తుల ప్ర‌దానం


స‌నాత‌న ధార్మిక విజ్ఞాన ప‌రీక్ష‌ల విజేత‌ల‌కు అక్టోబ‌రు 27 నుండి ఆయా ప్రాంతాల్లో బ‌హుమ‌తుల ప్ర‌దానం

అక్టోబరు 25, తిరుపతి 2018: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన 35వ స‌నాత‌న ధార్మిక విజ్ఞాన ప‌రీక్ష‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థులకు అక్టోబ‌రు 27వ తేదీ నుండి ఆయా ప్రాంతాల్లో బ‌హుమ‌తులు ప్ర‌దానం చేయ‌నున్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌తోపాటు చెన్నై న‌గ‌రంలో క‌లిపి 700 కేంద్రాల్లో సుమారు 60 వేల మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌లు రాశారు. వీరిలో రాష్ట్ర‌స్థాయిలో, జిల్లా స్థాయిలో ప‌లువురు విద్యార్థులు ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు.

అక్టోబ‌రు 27న వైజాగ్‌లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పంలో, అక్టోబ‌రు 28న విజ‌య‌వాడ‌లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పంలో, అక్టోబ‌రు 30న వ‌రంగ‌ల్‌లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పంలో, న‌వంబ‌రు 1న హైద‌రాబాద్‌లోని స‌మాచార కేంద్రంలో, న‌వంబ‌రు 10న తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో విద్యార్థుల‌కు బ‌హుమ‌తుల ప్ర‌దానోత్స‌వం జ‌రుగ‌నుంది. చెన్నైతోపాటు చిత్తూరు, క‌డ‌ప‌, అనంత‌పురం, క‌ర్నూలు, నెల్లూరు జిల్లాల విద్యార్థుల‌కు తిరుప‌తిలో బ‌హుమ‌తులు ప్ర‌దానం చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



By TTD News October 25, 2018 at 06:15PM


Read More http://news.tirumala.org/app/

No comments