JEO INSPECTS AND REVIEWS ON DISPLAY BOARDS_ డిస్‌ప్లే బోర్డుల ద్వారా భక్తులకు ఉపయోగకరమైన సమాచారం అందించాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirumala, 26 October 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Friday inspected and reviewed on the signage boards and display boards to be places at various places in Tirumala.
The review meeting on the useful information to be displayed for pilgrims in VQC compartments took place at Gokulam Rest House. He directed the concerned to come out with crisp information on the different amenities, opening time of compartments etc.for pilgrims who are waiting in VQC.
INSPECTION
Earlier he inspected the signage boards to be erected at GNC, Lepakshi, ANC areas with CVSO Incharge Sri Siva Kumar Reddy, SE 2 Sri Ramachandra Reddy, VSO Sri Manohar and others were also present.
Later he also visited GMC tollgate and inspected the display board.
SE Electrical Sri Venkateswarulu, DE Smt Saraswathi, DyEE Radio and Broadcasting Smt Rama Devi were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
డిస్‌ప్లే బోర్డుల ద్వారా భక్తులకు ఉపయోగకరమైన సమాచారం అందించాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
అక్టోబరు 26, తిరుమల 2018: తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గల కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు డిస్‌ప్లే బోర్డుల ద్వారా టిటిడి అందిస్తున్న సేవలు, సౌకర్యాల సమాచారాన్ని తెలియజేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు అధికారులకు సూచించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో గల జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఎలక్ట్రికల్, ఐటి, వైకుంఠం క్యూకాంప్లెక్స్, విజిలెన్స్ అధికారులతో జెఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ దాదాపు రెండు కోట్ల వ్యయంతో కంపార్ట్‌మెంట్లలో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేశామని, తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో భక్తులకు సమాచారం తెలియజేయాలని ఆదేశించారు. కంపార్ట్‌మెంట్ల నుంచి భక్తులను వదిలే సమయం, అన్నప్రసాద వితరణ, గదుల సమాచారం, లగేజీ, సెల్ ఫోన్లు పొందే విధానం, ఫుడ్ కౌంటర్లు, జలప్రసాద కేంద్రాలు తదితర వివరాలను తెలియజేయాలన్నారు.
అనంతరం జిఎన్‌సి టోల్‌గేట్ వద్ద ఏర్పాటుచేసిన డిస్‌ప్లే బోర్డును జెఈవో పరిశీలించారు. ఇక్కడ కూడా భక్తులకు టిటిడి కల్పిస్తున్న సౌకర్యాల సమాచారాన్ని ప్రదర్శిస్తారు.
ఈ సమావేశంలో ఎస్ఇ ఎలక్ట్రికల్ శ్రీ వేంకటేశ్వర్లు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్ఓ శ్రీ మనోహర్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రేడియో బ్రాడ్కాస్టింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సూచిక బోర్డుల పరిశీలన
అంతకుముందు జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సూచిక బోర్డులను పరిశీలించారు. జీఎన్‌సి టోల్‌గేట్, ఏఎన్‌సి, లేపాక్షి సర్కిల్ ప్రాంతాల్లో గల సూచిక బోర్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులు సులువుగా అర్థం చేసుకునేలా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.
జెఈవో వెంట టిటిడి ఇన్‌చార్జి సివిఎస్ఓ శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్వో శ్రీ మనోహర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీ మల్లికార్జున ప్రసాద్ తదితరులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
By TTD News October 26, 2018 at 08:06PM
No comments