Breaking News

రజనీ ఊపు.. మామూలుగా లేదు!


ఒకప్పుడు ఏడాదికో రెండేళ్లకో రజనీకాంత్‌ నటించే ఒక చిత్రం వస్తుందంటే అభిమానులు ఆశగా ఎదురుచూసేవారు. కానీ అదేమి చిత్రమో తెలియదు గానీ ఈయన గత కొంతకాలంగా వేగంగా చిత్రాలు చేస్తున్నాడు. ‘2.ఓ’ విడుదలకు ముందే ‘కబాలి, కాలా’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక నవంబర్‌లో ఆయన నటించిన ప్రతిష్టాత్మక ‘2.ఓ’ విడుదలకు సిద్దమవుతోంది. ఈ ఉత్సాహంలో అభిమానులు ఉండగానే ఆయన వెంటనే సన్‌పిక్చర్స్‌ సంస్థలో విభిన్నచిత్రాలు తీసే.. టాలెంటెండ్‌ యంగ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌తో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ఈ చిత్రం పేరు ‘పెట్టా’. సిమ్రాన్‌, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని ఎప్పుడో విడుదల చేశారు. తాజాగా సెకండ్‌లుక్‌ని కూడా రిలీజ్‌ చేసి అభిమానులకు రజనీ డబుల్‌ బొనాంజా ఇచ్చాడు. ఫస్ట్‌లుక్‌లో రజనీ ఫుల్‌ మాస్‌గా కనిపిస్తే, సెకండ్‌లుక్‌లో ఆయన క్లాస్‌గా కనిపించారు. ఈ లుక్స్‌ని బట్టి రజనీకి ఈ చిత్రంలోని క్యారెక్టర్‌లో రెండు షేడ్స్‌ ఉంటాయని అర్ధమవుతోంది. అలాగే సెకండ్‌ లుక్‌ 1980ల కాలం నాటిదిగా కనిపిస్తోంది. అంటే ఈ చిత్రం 1980ల కాలం నాటి బ్యాగ్రౌండ్‌లో కొనసాగుతుందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ‘పెట్టా’ చిత్ర షూటింగ్‌ వారణాసిలో జరుగుతోంది. రజనీ, త్రిష, విలన్‌గా నటిస్తోన్న కోలీవుడ్‌ యంగ్‌స్టార్‌ విజయ్‌సేతుపతి మీద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. నవాజుద్దీన్‌ సిద్దిఖీ, విజయ్‌సేతుపతి, బాబీ సింహా, డైరెక్టర్‌ శశి, మేఘాఆకాష్‌, కీలకపాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. 

ఇటీవల రజనీ శంకర్‌ తప్పితే ఎక్కువగా పా రంజిత్‌, కార్తీక్‌సుబ్బరాజ్‌ వంటి యంగ్‌ డైరెక్టర్స్‌ని నమ్ముకుంటున్నాడు. చిత్రాలలో కూడా తమిళ వాసనలు ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో తమిళంలో తప్ప వీటికి తెలుగులో కూడా పెద్దగా ఆదరణ లభించండం లేదు. యంగ్‌ డైరెక్టర్స్‌ అందరు రజనీ గెటప్పులో చూపిన వైవిధ్యం, పవర్‌ఫుల్‌నెస్‌ని చిత్రాలలో మిస్‌ అవుతున్నారు. మరి ఇది సన్‌పిక్చర్స్‌ చిత్రం కాబట్టి కాస్త అంచనాల ఉన్నాయి. మరో వైపు రజనీ ‘2.ఓ’ తప్ప అన్ని చిత్రాలను తక్కువ బడ్జెట్‌లో చేస్తుండటం మరో విశేషం. 

మరి ఈయన రాజకీయ రంగప్రవేశంపై వార్తలు కూడా పెద్దగా రావడం లేదు. మరి రజనీ ఖచ్చితంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికైనా వస్తాడా? లేక అసెంబ్లీ ఎన్నికల వరకు వెయిట్‌ చేస్తాడా? సినిమాలకు ఇక బై చెప్పే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా ఈ వయసు, ఆరోగ్యపరిస్థితుల్లో కూడా వరుస చిత్రాలు చేస్తున్నాడా? అనే పలు ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. 



By October 08, 2018 at 03:00AM

Read More

No comments