Breaking News

ఇల్లీబేబి.. చాలా స్పెషల్ అని రుజువైంది


‘దేవదాస్‌’ ద్వారా వెండితెరకు పరిచమైన గోవా కోవా ఇలియానా. ఆ తర్వాత ఈమె తెలుగులో ఓ వెలుగు వెలిగింది. స్టార్‌ హీరోలందరినీ ఒకటికి రౌండ్లు వేసి తెలుగులో మొట్టమొదట కోటి రూపాయల పారితోషికం తీసుకున్న నటిగా ఈ నడుము సుందరి నిలిచింది. ఆ తర్వాత ఈ బీచ్‌ సుందరి తన ఒంపుసొంపులు, తనదైన జీరో సైజ్‌ ఫిజిక్‌లు బాలీవుడ్‌ వారికి కూడా సమ్మోహన పరుస్తాయని బిటౌన్‌ ఫ్లైట్‌ఎక్కింది. అక్కడ కొన్ని హిట్‌ చిత్రాలలో నటించినప్పటికీ ఆమె స్టార్‌ హీరోయిన్‌ హోదాను అందుకోలేకపోయింది. దాంతో దూరపు కొండలు నునుపు అనే సామెత ఆమెకి అనుభవంలోకి వచ్చింది.

బాలీవుడ్‌లో ఉన్నకాలంలో తెలుగులో పలువురు హీరోలు, దర్శకనిర్మాతలకు నో చెప్పిన ఆమె మరలా టాలీవుడ్‌కి వచ్చి రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక విషయానికి వస్తే సినిమాలలో అవకాశాలు తగ్గినా ఆమెకి ఉన్న క్రేజ్‌ మాత్రం తగ్గలేదు అనే దానికి ఓ ఉదాహరణ బయటకు వచ్చింది. ఈమె తాజాగా ‘అతి సంచలనాత్మక సెలబ్రిటీ’ (మోస్ట్‌ సెన్సేషనల్‌ సెలబ్రిటీ)గా నిలిచింది. అమెరికన్‌ గ్లోబల్‌ కంప్యూటర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహించిన సర్వేలో హ్యాకర్లు నెటిజన్లను మభ్యపెట్టి తప్పుడు వెబ్‌సైట్‌ క్లిక్‌ చేసేందుకు ఇలియానా పేరును ఎక్కువగా వాడుకున్నారని తేలింది.

ఇప్పటివరకు సైబర్‌ స్పేస్‌ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కపిల్‌శర్మని దాటేసుకుని వెళ్లి ఇలియానా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మెక్‌కెఫీ ప్రతినిధి వెంకట కృష్ణారావ్‌ మాట్లాడుతూ, సెలబ్రిటీలకు, సినీ పరిశ్రమ వారికి ఎక్కువగా క్రేజ్‌ ఉంటుంది. అభిమానులు తమకిష్టమైన వారి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అందుకే మాధ్యమాలను కనెక్ట్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది భద్రతను కూడా పక్కనపెడుతూ ఉంటారు. దీనిని సైబర్‌ నేరస్థులు అవకాశంగా తీసుకుంటూ ఉంటారు. తప్పుడు ఐడీలు పెట్టి సమాచారం దొంగిలించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి వినియోగదారులు సినిమాలు, సెలబ్రిటీలు, టీవీ షోలు, ఫొటోలు అని వచ్చేలింక్‌లను క్లిక్‌ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.. అనిసూచించారు. 

మరి ఇలియానాకు లభించిన ఈ ఘనతను మన హీరోలు, దర్శకనిర్మాతలు గమనిస్తే ఇల్లీ బేబీకి తెలుగులో వరుస అవకాశాలు రావడం ఖాయమనే చెప్పాలి. 



By October 07, 2018 at 10:43PM

Read More

No comments