Breaking News

బాలయ్య-యంగ్‌టైగర్ పార్టీ.. ఈ న్యూస్ విన్నారా?


 

గత వారం రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ - బాలకృష్ణ మీద న్యూస్ లు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో, ఇంటర్నెట్‌లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. గత కొంతకాలంగా ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ - బాలకృష్ణలు హరికృష్ణ మరణంతో ఒకటయ్యారు. అయితే ఎంతగా ఒక్కటిగా అనిపించినా నందమూరి అభిమానుల్లో ఏదో వెలితి. బాబాయ్ అబ్బాయ్‌ల మధ్య ఇంకొంత గ్యాప్ ఉందనేలా అరవింద సమేత సక్సెస్ మీట్ వేదికగా అనిపించింది. ఏదో... బాలకృష్ణ.. కళ్యాణ్ రామ్ అడగగా అరవింద కోసం వచ్చినప్పటికీ.. ఎన్టీఆర్ గురించి మాట్లాడక పోవడం.. ఎన్టీఆర్ కూడా బాబాయ్ బాలయ్య గురించి పొడిపొడిగా మాట్లాడడంతో అభిమానులతో పాటుగా అందరూ వారి మధ్య గ్యాప్ అట్టానే ఉందంటూ కామెంట్స్ చేసారు.

అయితే అదే రోజు రాత్రి జరిగిన పార్టీలో బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ లు కలిసి ఎంజాయ్ చేసిన విషయం తాజాగా బయటికొచ్చింది. అరవింద సమేత సక్సెస్ మీట్ జరిగిన రాత్రి ఎన్టీఆర్ తన ఇంట్లో బాబాయ్ కి పార్టీ ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో వినబడుతుంది. ఎన్టీఆర్ ఇచ్చిన స్పెషల్ పార్టీలో బాలకృష్ణ బాగా ఎంజాయ్ చేసాడని.. అసలు రాత్రంతా ఎన్టీఆర్ ఇంట్లోనే ఉన్నాడనే విషయం తెలిసినప్పటి నుండి నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. అరవింద ఈవెంట్ లో లైట్ గా ఉన్న బాబాయ్ అబ్బాయ్ లు పార్టీలో లో మనసు విప్పి మాట్లాడుకున్నారా?

అసలింతకీ గంటల తరబడి బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య అంత ఆసక్తికరంగా చర్చ జరిగిన విషయం ఏమిటో గాని.. ప్రస్తుతం బాలయ్య - ఎన్టీఆర్ ల పార్టీ విషయాలు మీడియాలో రకరకాల గాసిప్స్ తో చక్కర్లు కొడుతున్నాయి. బాలకృష్ణ ఎన్టీఆర్ తో సినిమాల గురించి, కుటుంబం గురించి అలాగే రాబోయే ఎన్నికల గురించి మాట్లాడుంటాడని.. బాబాయ్ తో కలవడం కోసమే వేచి చూస్తున్న ఎన్టీఆర్ ఇవన్నీ శ్రద్దగా విన్నాడనే న్యూస్ హైలెట్ అయ్యింది. మరి ఎన్టీఆర్ ని 2019 ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చే ఏర్పాట్లు ఈ పార్టీతో మొదలైందని టాక్ మాత్రం రేజ్ అయ్యింది. మరి నిజమ్ గా ఆ పార్టీలో ఏం జరిగిందో తెలియదు గాని.. ముందసలు ఆ పార్టీ జరిగినందుకు నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతుంటే... ఇప్పుడు ఆపార్టీలో ఏం జరిగిందో ఏమిటో అనే మీమాంసలో మీడియా ఉంది.



By October 24, 2018 at 05:08PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43164/young-tiger-ntr.html

No comments