Breaking News

ఇష్టంతోనే.. బలాత్కారం చేయట్లేదుగా? ‘మీటూ’ ఏంటి?


 

సాధారణంగా ప్రతి సమాజంలో మహిళలను ప్రత్యేకంగా పరిగణిస్తారు. తప్పు ఎవరి వైపు ఉన్నా చట్టాల నుంచి, న్యాయస్థానాలు, సమాజం మొత్తం ఆడవారినే బాధితులుగా, మగవారిని నిందుతులుగా చూస్తాయి. అయితే సినీ రంగంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ మాత్రం కాస్త విభిన్నమైనది. బాగా సినీ అనుభవం ఉన్న ఎవరైనా ఇందులో మహిళలు ఇష్టపడి చాన్స్‌ల కోసం వస్తేనే లైంగికంగా వాడుకుంటారు గానీ ఇక్కడ పెద్దగా మానభంగం, బలాత్కారం వంటివి ఉండవు. ఇద్దరు ఎవరికి వారు తమ స్వార్థాన్ని, తమకున్న అందాన్ని, తమకున్న పలుకుబడిని వాడుకుంటారు. అంతేగానీ ఇక్కడ ఆడవారి ప్రమేయం లేకుండానే లైంగిక వేధింపులు జరగడం చాలా తక్కువ. కాబట్టి ఇది పరస్పర అంగీకారం కిందకే వస్తుంది గానీ బలాత్కారం కిందకు రాదనే చెప్పాలి. 

ఇదే విషయాన్ని తాజాగా బాలీవుడ్‌ శృంగార నటి రాఖీసావంత్‌ కూడా స్పష్టం చేసింది. దీనిపై ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఆమె మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలో 99శాతం మందిహీరోయిన్లు నిర్మాతలతో ఇతరులతో సెక్స్‌కి ఇష్టపడే వస్తారు. మరిన్ని అవకాశాలు వస్తాయనే స్వార్ధంతోనే వారు పడకగదికి ఓకే అంటారు. అంతేగానీ ఎవ్వరూ ఈ విషయంలో ఎవ్వరినీ బలవంతం చేయరు. జస్ట్‌... మీకు అవకాశం ఇస్తాం... మా కోరిక తీర్చండి అనే వారే ఉంటారు. ఈ విషయంలో వారిని భయపెట్టేవారు, బలవంతం చేసేవారు.. అత్యాచారాలకు పాల్పడే వారు ఎవ్వరూఉండరు.

మహిళలను లైంగిక సుఖాల కోసం వాడుకునే విషయంలో కాస్టింగ్‌ చూసుకునే డైరెక్టర్‌కే ఎక్కువ బాధ్యత ఉంటుంది. సినిమా అవకాశాల కోసం వచ్చే వారు ముందుగా వీరి వలలోనే పడుతారు. ఈ విషయంలో మగవారు ఆడవారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి పడకగదికి వచ్చిన అమ్మాయి ఆ తర్వాత మగాళ్లను బ్లాక్‌మెయిల్‌ చేసి ఆపై బాగా బెదిరించే అవకాశాలు ఉన్నాయి.. అని చెప్పింది. ఈ విషయంలో కూడా నిజం ఉంది. మరి ఆమె మాటలను ఎందరు తప్పుపడతారో? ఎందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటారో వేచిచూడాల్సివుంది. 



By October 30, 2018


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43248/rakhi-sawant.html

No comments