Breaking News

మామా-అల్లుళ్ల సినిమా అప్‌డేట్ వచ్చింది..!


మేనమామ వెంకటేష్‌, మేనల్లుడు నాగచైతన్యల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ చిత్రం ప్రారంభం కానుందని దీనికి ‘పవర్‌, సర్దార్‌గబ్బర్‌సింగ్‌, జైలవకుశ’ ఫేమ్‌ రవీంద్ర అలియాస్‌ బాబీ దర్శకత్వం వహించనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనికోసం ‘వెంకీ మామా’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. బాబీ కథకు రచనాసహకారాన్ని స్టార్‌ రైటర్‌ కోనవెంకట్‌ అందించడంతో పాటు ఓ నిర్మాణభాగస్వామిగా కూడా కోనవెంకట్‌ ఉంటాడని, సురేష్‌ప్రొడక్షన్స్‌-పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలతో కలిసి కోనవెంకట్‌ నిర్మిస్తాడని క్లారిటీ వచ్చింది. 

అయితే మరోవైపు నాగచైతన్య ‘సవ్యసాచి’తో పాటు ‘నిన్నుకోరి’ ఫేమ్‌ శివనిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి నటించే ‘మజిలి’ ప్రారంభం అయిపోవడం, వెంకీ కూడా వరుణ్‌తేజ్‌తో అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌2’ తర్వాత త్రినాథరావు నక్కినకు ఓకే చెప్పాడని వార్తలు రావడంతో పలువురు ‘వెంకీమామ’ క్యాన్సిల్‌ అయిందని అన్నారు. నిజానికి బాబి-కోనవెంకట్‌లు చెప్పిన ఫైనల్‌ నెరేషన్‌కి సురేష్‌బాబు పూర్తిగా సంతృప్తి చెందలేదట. కానీ ఆయన చెప్పిన మార్పులు, చేర్పులు చేయడంతో తుదకు సురేష్‌ కూడా ఓకే చేశాడని తెలుస్తోంది. ఈ చిత్రం ఖచ్చితంగా ఉంటుందని తాజాగా యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. 

ఇది నిజంగా అక్కినేని ఫ్యాన్స్‌కి దగ్గుబాటి ఫ్యాన్స్‌కి సంతోషం కలిగించే విషయం. నిజజీవితంలో మేనమామ-మేనల్లుళ్లుగా ఉన్న చైతు-వెంకీలు ఇందులో అలాంటి పాత్రలే ధరించనుండటం మరింత విశేషంగా చెప్పాలి. ఇక వెంకీ సరసన హ్యూమా ఖురేషీని, నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ని ఫైనల్‌ చేశారు. డిసెంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకోనుందని తాజాగా చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు.



By October 29, 2018 at 11:50PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43247/venkatesh.html

No comments