Breaking News

టాక్ అలా ఉన్నా.. రామ్ హ్యాపీకి కారణం!


 

దసరా కానుకగా రామ్ నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే.  ‘నేను శైలజ’, ‘నేను లోకల్’ సినిమాలని కలిపి ఈసినిమా తీసారని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన పై కామెంట్స్ వస్తున్నాయి. మొదటిరోజు నుండి డివైడ్ టాక్ తో రన్ అవుతున్న ఈసినిమాలో హీరోయిన్‌గా అనుపమ నటించింది.

రామ్.. అనుపమల అభినయం పర్లేదు అనిపించినా రోజురోజుకు వసూళ్లు తగ్గిపోతున్నాయి. అయితే హీరో రామ్ గాల్లో తేలిపోతున్నాడు. ఆనందంతో పండగ చేసుకుంటున్నాడు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఈ సినిమా ఎలా ఆడుతుందో అనేది రామ్ పట్టించుకోకపోయినా అతడి కెరీర్ లోనే ఈసినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకోవడంతో పండగ చేసుకుంటున్నాడు.

అతడి ఆనందానికి కారణం ఇది. ఒక్క రామ్ మాత్రమే ఇలా కాదు చాలా మంది యంగ్ హీరోస్ అంతా ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. కలెక్షన్స్ .. టాక్ తో సంబంధం లేకుండా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చేస్తుండటంతో సంబరపడిపోతున్నారు.



By October 22, 2018 at 07:15AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43122/ram.html

No comments