Breaking News

'సై రా' ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!


చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అత్యంత భారీగా తెరకెక్కిస్తున్న సినిమా సై రా నరసింహారెడ్డి. స్వాతంత్ర సమరయోధుడు అయిన ఉయ్యాలావాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని రామ్ చరణ్ దేశంలోని పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి తర్వాత మళ్ళీ అంత భారీ బడ్జెట్.... అన్ని అంచనాలున్న సినిమా సై రా నరసింహారెడ్డే. సై రా గురువు గారి పాత్రలో అమితాబ్... విజయ్ సేతుపతి, కన్నడ సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా వంటి అగ్ర తారాగణం నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం జార్జియా దేశంలో షూటింగ్ జరుపుకుంటుంది.

జార్జియాలో సైరా క్లైమాక్స్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లుగా .. ప్రస్తుతం ఆ యాక్షన్ సన్నివేశాలు ఫినిష్ అయినట్లుగా సై రా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఆ యాక్షన్ సన్నివేశాల్లో 300 ల మంది ఫైటర్స్ తో భారీ ఎక్విప్మెంట్ తో.. భారీ ఖర్చు(50  కోట్లు) అక్కడ క్లైమాక్స్ ని షూట్ చేశాడు సురేందర్ రెడ్డి. ఆ క్లైమాక్స్ షూట్ కోసం జార్జియాలో ఐదు వారాల పాటు... ఏకంగా ఐదుగురు హాలీవుడ్ ఫైట్ కొరియోగ్రాఫర్లు ఆధ్వర్యంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అహోరాత్రులు శ్రమించి ఆ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా చెబుతున్నారు. 

సై రా నరసింహారెడ్డి సినిమా మొత్తానికి క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తుంది అని మూవీ యూనిట్ చెబుతున్న మాట. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా... టాప్ టెక్నీకల్ టీం ఈ సినిమా కోసం పని చేస్తుంది. ఇక ఈ సినిమాని వచ్చే వేసవికల్లా పూర్తి చేసి వేసవి సెలవుల్లో విడుదల చెయ్యాలని చిత్ర బృందం భావిస్తుంది.



By October 25, 2018 at 06:54AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43169/ratnavelu.html

No comments