వామ్మో.. కత్రినా మళ్లీ చించేసిందిగా..!
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో అమితాబ్‌బచ్చన్, అమీర్‌ఖాన్‌లు కలసి నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారితో మనవారు చేసిన పోరాటం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తెలుగులో కూడా డబ్బింగ్ వెర్షన్‌ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదలైంది. ఇందులోని వీడియోలో అమితాబ్, అమీర్‌ఖాన్‌లు తెలుగులో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. దీపావళి కానుకగా నవంబర్ 8న విడుదల కానున్న ఈ చిత్రంలోని హీరోయిన్ కత్రినాకైఫ్‌కి సంబంధించిన ఓ సాంగ్ ప్రొమోను తాజాగా విడుదల చేశారు.
ఇందులో కత్రినా.. సురైయా అనే నర్తకి పాత్రను పోషిస్తోంది. సురైయా టైటిల్‌తోనే ఈపాట ప్రోమోను విడుదల చేయడం విశేషం. ఇందులో పచ్చ, ఎరుపు రంగులతో కూడిన లెహెంగాను ధరించి కత్రినాచేసిన డ్యాన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటే చుట్టు ఉన్న బ్రిటిష్ వారు కూడా ‘వావ్’ అంటూ కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. కత్రినాకైఫ్, అమీర్‌ఖాన్‌లపై ఈ పాటను చిత్రీకరించారు.
ఇందులో అమితాబ్, అమీర్ కలిసి తొలిసారిగా ‘వష్‌మల్లె’ పాటలో కలసి డ్యాన్స్ చేశారు. ఈ పాట, అమితాబ్, అమీర్‌ల డ్యాన్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతుందని యూనిట్ ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ పాటను ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయడం మరో విశేషం. ఇందులో కత్రినా కైఫ్‌తో పాటు ఫాతిమా సనాషేక్ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.
By October 26, 2018 at 10:49AM
No comments