Breaking News

శుభాకాంక్షలు చెప్పినందుకు తాట తీశారు


మలయాళంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని సినీరంగాలలో సంచలనం సృష్టించిన విషయం మలయాళ నటి మీద స్టార్‌ దిలీప్‌ చేశాడని చెబుతోన్న కిడ్నాప్‌, లైంగిక వేధింపుల ఘటన, నిజానికి దీని తర్వాతే నటీమణులందరిలో చైతన్యం వచ్చింది. అది హాలీవుడ్‌ నుంచి మనదేశంలో కూడా 'మీటూ' క్యాంపెయిన్‌ చేసే స్థాయికి ఎదిగి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక విషయానికి వస్తే దీనిలో నిందితుడైన మలయాళ స్టార్‌ దిలీప్‌ ఇప్పటికే జైలుకి వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇందులో ఆయన భార్య కావ్య ప్రమేయం కూడా ఉందని అనుమానాలు రేకెత్తుతున్నాయి. మోహన్‌లాల్‌ కూడా మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 

ఇక తాజాగా మరో పాత్రికేయురాలు కూడా ఇలాంటి విషయంలోనే ఘాటు విమర్శలకు గురి అవుతోంది. విషయానికి వస్తే దిలీప్‌, ఆయన భార్య కావ్య దంపతులకు తాజాగా ఆడపిల్ల జన్మించింది. ఈ సందర్భంగా తమిళనాడుకి చెందిన ప్రముఖ పాత్రికేయురాలు ట్విట్టర్‌ ద్వారా ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది. 'లవ్లీకపుల్‌ దిలీప్‌, క్యావలకు ఆడశిశువు జన్మించింది... శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేసింది. దీంతో ఆ పాత్రికేయురాలిపై మంచు లక్ష్మి, రకుల్‌ప్రీత్‌సింగ్‌, తాప్సిలు ట్విట్టర్‌ వేదికగా మండిపడుతున్నారు. 

'నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికీ నిందుతునిగా ఉన్న దిలీప్‌ను నువ్వు ట్యాగ్‌ చేయడం నమ్మలేకపోతున్నా. మలయాళ సినీ పరిశ్రమలోని అనేక మంది నటీమణులు ఆయనకు వ్యతిరేకంగా ఉండటంతో ఆయన సినిమాలు చేయలేకపోతున్నాడు. కానీ ఇక్కడ నువ్వు మీడియా మాత్రం ఆయనకు అనుకూలంగా ఉన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని మంచు లక్ష్మీ ట్వీట్‌ చేసింది. 'ఓ మహిళే 'మీటూ' ఉద్యమానికి మద్దతు ఇవ్వకుండా, వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇబ్బదికరంగా ఉంటుంది' అని తాప్సి వ్యాఖ్యానించింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ 'దిలీప్‌ వంటి వ్యక్తుల గురించి మీడియా గొప్పగా చెప్పకూడదు. మనమే ఆ నటిపై జరిగిన దానికి పోరాడకుండా ఉంటే ఇక ఎవరు పోరాడుతారు? నీ నుంచి ఇలాంటి ట్వీట్‌ వచ్చిందంటే నమ్మలేకపోతున్నా.. మార్పు మన నుంచే వచ్చిందని గుర్తుపెట్టుకో' అని ఘాటుగా హెచ్చరించింది. 



By October 23, 2018 at 10:43AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43145/manchu-lakshmi.html

No comments