Breaking News

చైతూ గురించి చెప్పడం మరిచిపోయాడట!!


‘ప్రేమమ్‌’ చిత్రం తర్వాత డైరెక్ట్‌ సబ్జెక్ట్‌తో వరుస విజయాలు సాధిస్తోన్న మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో చందుమొండేటి-నాగచైతన్యల కాంబినేషన్‌లో వస్తున్న డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రం ‘సవ్యసాచి’. ఈ మధ్య ‘రారండోయ్‌ వేడుక చూద్దాం, శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో ఊపు మీదున్న నాగచైతన్య నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలను ఆదరిస్తున్న తరుణంలో ఈమూవీ ఖచ్చితంగా హిట్‌ అవుతుందనే అంచనాలు భారీగానే ఉన్నాయి. అందునా ఇందులో ప్రతినాయకుడిగా నటించడానికి ఇండియన్‌ గ్రేట్‌ యాక్టర్‌ మాధవన్‌ ఒప్పుకోవడంతో పాటు భూమిక కీలకపాత్రను చేస్తుండటం, ‘బాహుబలి’ తర్వాత ఎం.ఎం.కీరవాణి ఎంతో ఇష్టపడి చేస్తున్న చిత్రం కావడం ముఖ్యవిశేషం. ఇంత మందిని మెప్పించిందంటే దీనిలో సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఏదో ఉందని అనిపిస్తోంది. 

మరోవైపు ఈ చిత్రం మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలే నైజాంలో విడుదల చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇది దాదాపు 25 కోట్ల వరకు ప్రీరిలీజ్‌ బిజినెస్‌ని సాధించిందని సమాచారం. కాగా ఈ మూవీకి ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్‌లిరిక్‌ రైటర్‌ రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకకు విజయ్‌దేవరకొండ హాజరుకాగా, ఇందులో రామజోగయ్యశాస్త్రికి ఎక్కువగా మాట్లాడే అవకాశం లభించలేదు. దాంతో అక్కినేని నాగచైతన్య గురించి తానో విషయం చెప్పాలని భావించానని, కానీ అవకాశం లభించకపోవడంతో ట్విట్టర్‌ ద్వారా తెలుపుతున్నానని రామజోగయ్యశాస్త్రి తెలిపారు. 

ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘ప్రీ రిలీజ్‌ వేడుకలో నాగచైతన్య గురించి ఓ విషయం చెప్పడం కుదరలేదు. చై... నువ్వు సినిమాలో ఎంతో హ్యాండ్సమ్‌గా ఉన్నావు. ముఖ్యంగా సినిమాలో ఓ వ్యక్తిని నీ ఎడమచేత్తో ఎత్తి కొడుతున్నప్పుడు ఇంకా బాగా ఉన్నావ్‌. దర్శకుడు చందు మొండేటికి కృతజ్ఞతలు. కంటెంట్‌ పరంగా ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం నాకు రెండు రెట్లు ఎక్కువగా ఉంది’ అని తెలిపాడు. దీనికి నాగచైతన్య స్పందిస్తూ ‘ధన్యవాదాలు సార్‌’ అని సమాధానం ఇచ్చాడు. 



By October 30, 2018 at 11:00AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43259/ramajogayya-sastri.html

No comments