Breaking News

‘మీటూ’ ఉన్నా.. షూటింగ్ స్పాట్‌లోనే వేధింపులు


ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళలు ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు ప్రముఖులు తమని లైంగిక వేధింపులకు గురిచేశారని, అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఉద్యమం కక్ష్యసాధింపులకు, పబ్లిసిటీ కోసం కూడా పెడదోవ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇది రాజకీయ రంగాన్ని కూడా వదలలేదు. ఏకంగా కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్‌ పదవి నుంచి వైదొలగేలా ఇది చేసింది. అదే సమయంలో సినీ రంగంలో నానాపాటేకర్‌పై తనుశ్రీదత్తా ఆరోపణలు చేయడంతో ఆయన ‘హౌస్‌ఫుల్‌4’ చిత్రం నుంచి వైదొలగాడు. ఈ పాత్రకు దగ్గుబాటి రానాని సంప్రదిస్తున్నారని సమాచారం. 

ఇక ‘మీటూ’ ప్రభావం ముఖ్యంగా ‘హౌస్‌ఫుల్‌4’ మూవీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఆరోపణల కారణంగానే ఈ చిత్ర దర్శకుడు సాజిద్‌ఖాన్‌ తప్పుకున్నాడు. ఇలా ఈ నానా, సాజిద్‌లు ఇద్దరు తప్పుకున్న తర్వాత కూడా ఈ దెబ్బలు ఆగలేదు. ఈ చిత్రం షూటింగ్‌లోనే అక్షయ్‌కుమార్‌, రితేష్‌దేశ్‌ముఖ్‌లు సెట్లో ఉండగానే తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఓ జూనియర్‌ మహిళా ఆర్టిస్ట్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో కలకలం రేపింది. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కువగా ‘మీటు’ ద్వారా బయటకు వచ్చిన వేధింపులు కొంత కాలం కిందట, ఎంతో కాలం కిందటివి మాత్రమే. కానీ ఓ చిత్రం షూటింగ్‌లో ఉండగానే ఇలాంటి ఆరోపణలు రావడం ఈ సంచలనానికి కారణమైంది. 

అయితే ఈ ఘటనపై ఆ చిత్ర ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత వెంటనే స్పందించాడు. ఆరోపణలు చేసిన జూనియర్‌ ఆర్టిస్ట్‌ స్నేహితునికి, డ్యాన్స్‌మాస్టర్‌కి మద్య కాస్త గొడవైంది. ఈ సంఘటన జరిగిన సమయంలో అక్షయ్‌కుమార్‌, రితేష్‌దేశ్‌ముఖ్‌లు షూటింగ్‌ స్పాట్‌లో లేరు. ఆ మహిళా ఆర్టిస్టు స్నేహితునికి, మా యూనిట్‌కి అసలు సంబంధమే లేదు. బయటి వ్యక్తులతో జరిగిన గొడవలను కూడా చిత్ర యూనిట్‌కి ఆపాదించడం సరికాదు. జూనియర్‌ ఆర్టిస్టును షూటింగ్‌లో ఎవరు లైంగికంగా వేధించలేదని స్పష్టం చేశాడు. మరి దీనికి ఆ మహిళా ఆర్టిస్ట్‌ ఏమి సాక్ష్యాధారాలు చూపుతుందో వేచిచూడాల్సివుంది...! 



By October 30, 2018 at 10:55AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43258/junior-artist.html

No comments