ఈ దర్శకుడు మహేష్ పరువు తీసేశాడుగా..?
ప్రిన్స్ మహేష్ బాబు, డైరెక్టర్ మెహెర్ రమేష్ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. బాబీ మూవీ నుండి వీరిద్దరూ మంచి స్నేహితులు. మహేష్ ఎక్కడికి వెళ్లినా తనతో పాటు రమేష్ కూడా వెళ్తుంటాడు. మహేష్ కు విజయవాడలో రియల్ ఎస్టేట్ యాడ్స్ రావడానికి కారణం రమేషే అని టాక్. అటువంటి రమేష్ వల్ల ఇప్పుడు మహేష్ బాబు పరువు పోయిందనే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తుండటం విశేషం.
విషయంలోకి వస్తే.. ఈనెల 27న అమెరికాలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ వాళ్ళు ఒక ఫండ్ రైజింగ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కోసం టికెట్ కొనుక్కున్న వాళ్ళు అక్కడ మహేష్‌తో కూర్చుని డిన్నర్ చేసే అవకాశం కలిపించారు ‘మా’ వాళ్ళు. దానికి సంబంధించి టిక్కెట్ ధరలు కూడా 500, 1000, 1500 డాలర్స్ గా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి ప్రమోషన్ కోసం మహేష్ బాబుని పెట్టి మెహెర్ రమేష్ ఓ డాక్యుమెంటరీ రెడీ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
అతను చేసిన డాక్యుమెంటరీలో పస లేదని.. దాని వల్ల మహేష్ కరిష్మా తెలుపకపోగా.. నిరాసక్తత కలిగించిందని చూసినవాళ్లు చెప్పారు. దాంతో ఈ ఈవెంట్‌కి కనీసం 20 టిక్కెట్లు కూడా అమ్ముకోలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. సో అలా ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఈ ఈవెంట్ రద్దవడంతో ఓవర్సీస్‌లో మహేష్‌బాబు పరువు పోయినట్లయింది. దీనికి మెహెర్ రమేషే కారణం అని చాలా మంది అంటున్నారు.
By October 29, 2018 at 05:32AM
No comments