Breaking News

నాతో సహజీవనం, ఆమెతో ప్రేమా: నిఖిషా..?!


మొదటి చిత్రమే పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ సరసన... అందునా మంచి అందగత్తె.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ యువతి కావడంతో గ్లామర్‌ షోలకి కూడా కొదువలేదు. పవన్‌తో 'ఖుషీ' వంటి బ్లాక్‌బస్టర్‌ తీసి, అందులో భూమికను ఎంతో అందంగా, దేవకన్యలా చూపించిన తమిళ దర్శకుడు ఎస్‌.జె.సూర్య చిత్రం. అదే 'పులి అలియాస్‌ కొమరం పులి'. ఈ చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ తర్వాత నిఖిషాపటేల్‌కి తిరుగేలేదని భావించారు. కానీ ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆ వెంటనే కన్నడ, తమిళంలో పలు చిత్రాలలో నటించింది. తెలుగులో 'ఓంత్రీడీ, అరకురోడ్డులో, గుంటూర్‌ టాకీస్‌ 2' వంటి చిన్న చిత్రాలు చేసినా గుర్తింపు రాలేదు. 

ఇదే సమయంలో ఇండియన్‌ క్రికెటర్‌ శ్రీశాంత్‌ ప్రేమలో పడింది. కేరళ ఎక్స్‌ప్రెస్‌గా పిలుచుకునే స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌ ఒకనాడు భారత క్రికెట్‌ టీంలో అత్యంత కీలకమైన ఫాస్ట్‌బౌలర్‌. కానీ స్పాట్‌ ఫిక్సింగ్‌ కారణంగా జీవితాంతం క్రికెట్‌ నుంచి బహిష్కృతుడు అయ్యాడు. దాంతో ఆయన నటనపై కూడా ఆసక్తి చూపించాడు. ఇక శ్రీశాంత్‌, నిఖిషాపటేల్‌ల మధ్య ఎఫైర్‌ నడిచినా, వీరు ఎప్పుడు దానిని ఒప్పుకోకపోగా మీడియాపై మండిపడి తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పారు. ఇక తాజాగా శ్రీశాంత్‌ వివాహం చేసుకున్నాడు. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న భువనేశ్వరితో ఒకటయ్యానని ప్రకటించాడు. 

దీనిపై నిఖిషా మండిపడింది. 'ఏడేళ్లుగా వేరే అమ్మాయితో ప్రేమను కొనసాగిస్తున్న శ్రీశాంత్‌ ఈ కాలంలోనే తనతో ఏడాది పాటు సహజీవనం చేసిన విషయాన్ని మర్చిపోయాడా? లేక దాచిపెడుతున్నాడా?' అని ఫైర్‌ అయింది. 'శ్రీశాంత్‌తో ప్రేమ, సహజీవనం వంటివి బ్రేక్‌ అయిన తర్వాత నా కెరీర్‌ ప్రశాంతంగా, సాఫీగా సాగిపోతోంది. కానీ అతను అబద్దం చెప్పడం మాత్రం సహించలేకపోతున్నాను.. దానిని జీర్ణం చేసుకోలేక పోతున్నానని' ఆవేదనతో కూడిన ఘాటు వ్యాఖ్యలు చేసింది.



By October 20, 2018 at 10:09AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43096/nikesha-patel.html

No comments