Breaking News

యంగ్‌రెబెల్‌స్టార్‌ ఇచ్చే సర్‌ప్రైజ్‌ ఏమిటి?


‘బాహుబలి’ రెండు భాగాలతో యంగ్‌రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కాస్తా నేషనల్‌ ఐకాన్‌గా, విదేశాలలో కూడా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ‘బాహుబలి-దికన్‌క్లూజన్‌’ చిత్రం వచ్చి ఏడాది అయింది. అప్పటినుంచి ప్రభాస్‌ తన స్నేహితులతో కూడిన, తన హోంబేనర్‌ వంటి యూవీక్రియేషన్స్‌ బేనర్‌లో ‘సాహో’ చిత్రం చేస్తున్నాడు. హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రాల రేంజ్‌లో ఇది ఉంటుందని అంటున్నారు. శంకర్‌ ‘2.ఓ’ తర్వాత దక్షిణాదిలో రూపొందుతున్న భారీ చిత్రాలలో ‘సాహో, సైరానరసింహారెడ్డి’లు నిలుస్తాయి. వీటిలో ముందుగా అంటే వచ్చే వేసవిలో వచ్చే చిత్రం ‘సాహో’. 

కేవలం ఒకే ఒక్క చిత్ర అనుభవం ఉన్న సుజీత్‌కి ఇది అగ్నిపరీక్షేనని చెప్పాలి. ఇక ప్రభాస్‌ బర్త్‌డే ఈనెల 23వ తేదీ. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ దసరా కానుకగా వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ వారికి ఏ అప్‌డేట్‌ రాలేదు కానీ కాస్త ఊరటనిచ్చే విషయం తెలిసింది. దాంతో ఆయన ఫ్యాన్స్‌ మరికొంత కాలం వెయిట్‌ చేయకతప్పదు. తన పుట్టినరోజున అంటే అక్టోబర్‌23వ తేదీన ‘సాహో’ చిత్రం మేకింగ్‌ వీడియోగానీ, మొదటి టీజర్‌ గానీ, లేదా ప్రస్తుతం ‘సాహో’తో పాటు జిల్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం టైటిల్‌ వంటి వాటిల్లో ముందుగా ప్రభాస్‌ ఏ గిఫ్ట్‌ని ప్రేక్షకులకు అందిస్తారో చూడాల్సివుంది..!

దీనికి మరింత సస్పెన్స్‌ని యాడ్‌ చేస్తూ ‘డియర్‌ ఫ్యాన్స్‌.....ఈ నెల 23వ తేదీన మీ అందరికీ ఓ అద్భుతమైన సర్‌ప్రైజ్‌ ఇవ్వనుండటం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.అందరికీ దసరా శుభాకాంక్షలు’ అనిఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఇక ప్రభాస్‌తో శ్రద్దాకపూర్‌ నటిస్తున్న ‘సాహో’, జిల్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌, పూజాహెగ్డే నటిస్తోన్నలవ్‌స్టోరీల షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. 

జిల్‌ రాధాకృష్ణ చిత్రం ప్రేమకథా చిత్రమని, దాని టైటిల్‌ ఫ్రెంచ్‌భాషకి చెందిన ‘అమూర్‌’ లేదా ‘జాన్’ అనే టైటిల్‌ని పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి వీటిల్లో ప్రభాస్‌ అందించే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఏమిటి? ఇంకేమైనా తన వివాహం విషయం వెల్లడిస్తాడా? అనే పలు చర్చలు సాగుతున్నాయి.



By October 20, 2018 at 03:23PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43101/prabhas.html

No comments