ప్రేమకథాచిత్రమ్ 2.. తేల్చుకుంటా: మారుతి
సుధీర్ బాబు హీరోగా నందిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'ప్రేమకథా చిత్రమ్'. ఈ సినిమాకి స్టోరీ.. స్క్రీన్ ప్లే.. మాటలు.. దర్శకత్వ పర్యవేక్షణ అన్ని మారుతినే చేశాడు. అప్పట్లో ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ప్రేమకథా చిత్రమ్ 2 గా ఈ సినిమా రాబోతుంది.
అయితే మారుతీకి తెలియకుండా ఆర్పీఏ క్రియేషన్స్ పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ కూడా ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్ లోనే రూపొందింది. తనకు చెప్పకుండా ఈ సినిమాను తీస్తున్నారనేది దర్శకుడు మారుతి వాదన. మొదటి పార్ట్ ఐడియా నాది అయినప్పుడు రెండో పార్ట్ కు ఎవరినో పెట్టి ఏమి చెప్పకుండా సీక్వెల్ తీయడమేంటనేది మారుతి వాదన.
త్వరలోనే దానికి సంబంధించి మారుతీ సినీ పెద్దలతో ఓ పంచాయితీ పెట్టే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది వాదన ఏంటంటే...సినిమా అనేది ప్రొడ్యూసర్ కే సొంతం. డైరెక్టర్, రైటర్ అందులో పనిచేసే వ్యక్తులు అంతే. సో ప్రొడ్యూసర్స్ ఇష్టం వచ్చినట్టు ఆ సినిమా విషయంలో ఏదైనా చేయొచ్చు. అందులో డైరెక్టర్ కి కానీ రైటర్ కి కానీ ఎటువంటి సంబంధం లేదు. మారుతీ ఇది ఆలోచించాడో లేదో చూడాలి.
By October 22, 2018 at 02:56PM
No comments