Breaking News

‘ప్రేమకధాచిత్రమ్ 2’ వామ్మో ఏంటిది..?


తెలుగులోనే కాదు.. బయటి భాషల్లో కూడా 'ముని, కాంచన, గంగ' తదితర చిత్రాల ద్వారా రాఘవ లారెన్స్‌ సృష్టించిన ట్రెండ్‌ని సైతం మించే స్థాయిలో తెలుగులో వచ్చిన హర్రర్‌ కామెడీ చిత్రం 'ప్రేమకథా చిత్రమ్‌' సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం దర్శకుడి విషయంలో ఎన్నోవార్తలు వచ్చినా దీనిని తానే డైరెక్ట్‌ చేశానని నిర్మాతగా వ్యవహరించిన మారుతి చెప్పాడు. ఈ చిత్రం సుధీర్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచి ఆ రకం చిత్రాల ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. ఇక ఇందులో నందితా కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ని చూపించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'ప్రేమకథాచిత్రమ్‌ 2' రూపొందుతోంది. 

అయితే దర్శకుడు, హీరో, హీరోయిన్లందరు మారిపోయారు. హరికిషన్‌ దర్శకత్వంలో ఇప్పటి వరకు సరైన హిట్‌ లేని సుమంత్‌ అశ్విన్‌ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. సిద్ది ఇద్నాని హీరోయిన్‌గా నటిస్తుండగా, 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' చిత్రంలో నిఖిల్‌ వెంటపడి భయపెట్టే పాత్రలో నటించిన నందితా శ్వేతా ఇందులో కీలకపాత్రను పోషిస్తోంది. సుదర్శన్‌ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది. వెరైటీగా పచ్చని పెళ్లి దుస్తుల్లో ఉగ్రరూపంతో ఎర్రబారిన నిప్పుకణికల్లాంటి కళ్లతో, ఎవరినో కోపంగా చూస్తూ, కాలుతో బంతిని తొక్కిపెడుతూ ఉన్న నందితా శ్వేతా లుక్‌ ఎంతో వెరైటీగా మరోసారి ఇలాంటి చిత్రాల ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తుందేమో అనే ఆశలను పెంచుతోంది. 

ఈమధ్యకాలంలో హర్రర్‌ చిత్రాలు తెలుగులో తగ్గినప్పటికీ ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను ఆ చిత్రాల వైపు ఆసక్తిని కలిగించేలా ఉంటుందని, షూటింగ్‌ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్దమవుతున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మరి ఈ చిత్రం 'ప్రేమకధాచిత్రం' సుధీర్‌బాబుకి ఎలాంటి బ్రేక్‌ ఇచ్చిందో, సుమంత్‌ అశ్విన్‌కి కూడా అలాంటి మెమరబుల్‌ హిట్‌ని అందిస్తుందో లేదో చూడాలి. మరోవైపు తెలుగులో సీక్వెల్స్‌ సరిగా ఆడవనే అపప్రదను ఇది పోగొట్టాల్సివుంది. 'హ్యాపీ వెడ్డింగ్‌' తర్వాత సుమంత్‌ అశ్విన్‌ నటిస్తున్న చిత్రం ఇదే కాగా.. ఇటీవలే '7' సినిమా పోస్టర్‌తో ఆకట్టుకున్న నందితాశ్వేతా మరోసారి వెరైటీగా కనిపిస్తోందనే చెప్పాలి. 



By October 20, 2018 at 09:38AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43094/nanditha-swetha.html

No comments