పెళ్లి వేడుకల్లో కలకలం.. ఆగంతుకుడి కాల్పుల్లో ఇద్దరు మృతి.. ఆరుగురికి గాయాలు

ఒకే వేదికలోని రెండు హాల్స్‌లో వేర్వేరు వివాహాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అతిథులు హాజరైన సమయంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఒక్కసారిగా వేదికంతా రక్తసిక్తంగా మారింది. కేకలు వేస్తూ జనం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు. ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకుంది. ఈ ఘటనతో అక్కడ తొక్కిసలాటకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చి.. బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు.
By September 04, 2023 at 08:59AM
By September 04, 2023 at 08:59AM
No comments