Breaking News

జల 14న చదరయన-3 పరయగ.. ఆ రడ రజలల చదరడప లయడగ: ఇసర


ఇస్రో 2019లో ప్రయోగించిన చంద్రయాన్‌-2 ల్యాండర్ సాఫ్ట్‌లాండింగ్‌ జరగకపోవడంతో విఫలమైంది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగుతూ క్రాష్ ల్యాండింగ్ జరిగి కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి మళ్లీ ఆ తప్పిదం జరగకుండా ఉండేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేయగలిగాయి. చంద్రయాన్-3ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి.. భారత్ కూడా వాటి సరసన చేరాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని ఇస్రో తెలిపింది. By July 07, 2023 at 07:47AM Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isro-announces-chandrayaan-3-launch-on-july-14-and-august-23-or-24-preferred-landing-dates/articleshow/101557901.cms

No comments