Air India కలకత్తా దుబాయ్ విమానంలో పాము కలకలం.. విషయం తెలిసి హడలిపోయిన ప్రయాణికులు
Air India ఓ విమానంలో పాము కలకలం రేపింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. అయితే, విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులు దిగిపోగా.. లగేజీలను దింపడానికి సిద్ధపడిన సమయంలో పాము కనిపించడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం కార్గో హోల్డ్‌లో సిబ్బంది పామును గుర్తించారు. ఈ విమానం కలకత్తా నుంచి కేరళలోని కాలికట్ మీదుగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు శనివారం చేరింది. ఈ సమయంలో ఘటన జరిగినట్టు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
By December 11, 2022 at 07:38AM
By December 11, 2022 at 07:38AM
No comments