Tika Dutta Pokharel: పార్లమెంట్ ఎన్నికల బరిలో వందేళ్ల వృద్ధుడు..!
Tika Dutta Pokharel: నేపాల్‌లో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. ఈనెల 20న అక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. నేపాల్ మాజీ ప్రధాని, మావోయిస్టు పార్టీ నేత పుష్పకమల్ దహల్‌పై ఓ వందేళ్ల వృద్ధుడు పోటీకి సై అన్నారు. నేపాలీ కాంగ్రెస్ (బీపీ) తరఫున గోర్ఖా-2 నియోజకవర్గం నుంచి టికా దత్తా పోఖారెల్ పోటీ చేయనున్నారు. దీంతో గోర్ఖా-2 నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది.
By November 02, 2022 at 11:43AM
By November 02, 2022 at 11:43AM
No comments