Jammu and Kashmir కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. టీవీ నటి దారుణ హత్య

కశ్మీర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. గతవారం కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను హత్యచేసిన ముష్కరులు.. తాజాగా, మరో ఇద్దరి పౌరులను పొట్టనబెట్టుకున్నారు. వరుసగా రెండు రోజుల్లో ఓ పోలీస్, టీవీ నటి హత్యకు గురికావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు, ఉగ్రవాదుల ఏరివేతను సైన్యం ముమ్మరంగా సాగిస్తోంది. రెండు రోజుల్లో ఆరుగురు తీవ్రవాదులు వేర్వేరు ఆపరేషన్‌లలో హతమైనట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తాజాగా వెల్లడించారు.
By May 26, 2022 at 09:11AM
By May 26, 2022 at 09:11AM
No comments