ఉత్తరకొరియాలో కరోనా విజృంభణ.. 8 లక్షలకుపైగా కేసులు, 42 మంది మృతి

నార్త్ కొరియాలో కోవిడ్ కలకలం రేపుతుంది. ఇప్పటి వరకూ అక్కడ 42 మంది చనిపోయారు. కోవిడ్ అనుమానిత కేసులు 820,620కు చేరుకున్నాయి. అలాగే ఆదివారం ఒక్కరోజే జ్వరంతో 15 మంది చనిపోయినట్టు అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. షాపులు, పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి. అయితే కోవిడ్‌ను అడ్డుకోవడం నార్త్ కొరియాకు సాధ్యంకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ అత్యంత దారుణమైన ఆరోగ్య వ్యవస్థ ఉందని, మందుల కొరత కూడా ఉందని అంటున్నారు.
By May 15, 2022 at 11:07AM
By May 15, 2022 at 11:07AM
No comments