బ్యాంకుకు కస్టమర్స్‌లా వచ్చారు.. రూ.6 లక్షలు దోచుకుపోయారు..!

పంజాబ్‌లోని అమృతసర్‌లోని ఓ బ్యాంకులో దొంగతనం జరిగింది. మాస్క్‌లు పెట్టుకుని నలుగురు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించి లక్షలాది రూపాయలు దోచుకెళ్లారు. పట్టపగలు ఉదయం 11 గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. కస్టమర్స్‌లా ప్రవేశించి డబ్బులు ఎత్తుకెళ్లిపోయారు. అనంతరం బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. కాగా ఇటీవల పంజాబ్‌లో దొంగతనాలు పెరిగాయి. వీటిపై విమర్శలు వస్తున్నాయి.
By May 06, 2022 at 11:21PM
By May 06, 2022 at 11:21PM
No comments