ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే.. ఇది ఫిక్స్! ఆయన జాతకం ప్రకారం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. గత కొన్నేళ్లుగా ఈ స్టార్ హీరో మ్యారేజ్ సంగతులు చర్చల్లో నిలుస్తూనే ఉన్నాయి. ప్రభాస్ సినిమా విడుదల ఉందంటే ఏ ప్రెస్ మీట్ జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా అంతా అడిగే మాట మీ పెళ్ళెప్పుడు? అని. ఇక ఇటీవల కాలంలో అయితే పెళ్లిపై బోలెడన్ని వార్తలు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి ఓ జ్యోషిష్యుడు చెప్పిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. అనే జ్యోతిష్యుడు ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదే జరుగుతుందని అంటున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఆయన పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అక్టోబరు 2022 నుంచి అక్టోబరు 2023 మధ్యలో జరిగే అవకాశం ఉందని, ఇదీ ప్యాన్ ఇండియా స్టార్ విషయంలో నా జ్యోతిష్యం అన్నారు ఆచార్య వినోద్ కుమార్. దీంతో మరోసారి ప్రభాస్ మ్యారేజ్ టాపిక్‌పై డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇకపోతే ప్రభాస్ పెళ్లి అనుష్కతో ఉంటుందని వస్తున్న వార్తలకైతే లెక్కే లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన ప్రభాస్- అనుష్క మూడు మూళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారని చాలా సార్లు విన్నాం. అయితే ఈ ఇష్యూపై ప్రభాస్ పెద్దమ్మ, రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి శ్యామల దేవి రియాక్ట్ అవుతూ ప్రభాస్- అనుష్కల పెళ్లి జరగదని, వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ తప్పితే వాళ్ళ మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పారు. మరోవైపు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి ఏదోలా దాటేస్తూ వస్తున్నారు ప్రభాస్. సినిమాల పరంగా ప్రభాస్ హవా నడుస్తోంది. వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన ఆయన ప్రస్తుతం ఫుల్ బిజీ షెడ్యూల్స్‌తో గడుపుతున్నారు. ప్రభాస్- పూజా హెగ్డే కాంబోలో తెరకెక్కిన్న మూవీ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. మార్చి 11న ఈ సినిమాను గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
By March 09, 2022 at 07:39AM
No comments