హృదయవిదారకం: భుజాలపై కూతురి శవాన్ని 10 కి.మీ మోసిన తండ్రి.. వీడియో వైరల్
మృతదేహాన్ని తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని ఆస్పత్రి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని తన గ్రామానికి తీసుకొచ్చిన హృదయవిదారక ఘటన చత్తీస్‌గఢ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. సుర్గుజా జిల్లాలో లఖన్‌పూర్ సమీపంలోని అమ్‌దాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ ఏడేళ్ల కుమార్తె సురేఖ అనారోగ్యానికి గురయ్యింది. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న పాపను ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకెళ్లారు. అయితే, అక్కడ పాప చనిపోయింది.
By March 26, 2022 at 10:22AM
By March 26, 2022 at 10:22AM
No comments