Breaking News

ఉక్రెయిన్ ప్రతిష్టంభన: రష్యాకు చైనా మద్దతు.. అమెరికా తీవ్ర వ్యాఖ్యలు


ఉక్రెయిన్‌‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉక్రెయిన్‌‌కు మూడు వైపుల నుంచి రష్యా తన సైన్యాలను మోహరించడంతో ఏ క్షణమైనా దాడి జరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో రష్యాకు లోపాయికారిగా మద్దతునివ్వడాన్ని తీవ్రంగా మండిపడింది. ఉక్రెయిన్ ప్రతిష్టంభనలో రష్యాకు చైనా లోపాయికారిగా మద్దతునిస్తోందని, ఇది తీవ్ర ఆందోళనకరమని పేర్కొంది. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బే ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘రష్యాకు చైనా లోపాయికారీ మద్దతు కోరుకుంటే తీవ్ర భయానకమైనది.. ఐరోపాలో భద్రతా పరిస్థితిని మరింత అస్థిరపరుస్తుంది.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దండయాత్ర చేయాలా? వద్దా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకున్నారని విశ్వసించలేం.. కానీ స్వల్ప హెచ్చరికతో లేదా ఎటువంటి హెచ్చరిక లేకుండా ముందుకు వెళ్లగలడు’’’’ అని జాన్ కెర్బీ అన్నారు. ఉక్రెయిన్ ప్రతిష్టంభనపై చర్చించేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మంగళవారం ఐరోపా పర్యటనకు వెళ్లనున్నట్టు కెర్బీ తెలిపారు. బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో సమావేశమవుతారని, పోలెండ్‌ను సందర్శించనున్నారని పేర్కొన్నారు. లుథ్వేనియాలో 3,000 మంది సైనికులను అమెరికా మోహరించనున్నట్టు వివరించారు. మరోవైపు, ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. అయితే, దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతాయని మేం నమ్ముతున్నామని స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యపరంగా సమస్య పరిష్కరానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని అన్నారు. అటు, ఉక్రెయిన్‌ను రష్యా సైన్యం చుట్టుముట్టడంతో కివ్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని పశ్చిమ ఉక్రెయిన్ నగరం లువివ్‌కు తరలించనున్నట్టు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేన్ సోమవారం ప్రకటించారు. కాగా, ఫిబ్రవరి 16 న ఉక్రెయిన్‌పై దాడి జరగొచ్చని ఏకంగా అమెరికా తేదీలతో సహా ప్రకటనలు చేయడం ఐరోపా సమాఖ్యలోని దేశాలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న సమయంలో యుద్ధం వస్తే తట్టుకొనే స్థితిలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థా లేదు. అమెరికా పరిస్థితి కూడా దీనికి మినహాయింపేమీ కాదు.


By February 15, 2022 at 09:47AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-slams-china-for-supporting-russia-on-ukraine-invasion/articleshow/89582448.cms

No comments