Breaking News

వింటర్ ఒలింపిక్స్.. టార్చ్ బేరర్‌గా గాల్వాన్‌‌లో గాయపడిన సీపీఎల్ఏ సైనికుడు


బుధవారం వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను‌ నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్‌బేరర్‌గా గ్వాలన్ లోయ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన సీపీఏల్ఏ కమాండర్‌కు అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన జిన్జియాంగ్ మిలటరీ కమాండర్ క్వీ ఫబోవో.. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు వాంగ్ మింగ్‌తో కలిసి ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని రిలేను ప్రారంభించారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. బీజింగ్‌లో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌ టార్చ్‌ రిలే బుధవారం ప్రారంభం కాగా.. చైనా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం యావో మింగ్‌తోపాటు క్వీ ఫబోవో జ్యోతిని పట్టుకొని నడిచారు. బీజింగ్‌ విశ్వకీడ్రల పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగుసార్లు షార్ట్‌ ట్రాక్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ చాంపియన్‌ వాంగ్‌ మెంగ్‌ జ్యోతిని ఫబావోకు అందజేసిందని చైనా గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. భారత్‌ సైన్యంతో గాల్వాన్ లోయలో 2020 జూన్ 15న జరిగిన ఘర్షణల్లో 40 మందికిపైగా జవాన్లు చనిపోయినా.. పరువు పోతుందనే భయంతో నలుగురు మాత్రమే మరణించారని డ్రాగన్ తక్కువచేసి చెప్పింది. నలుగురు సైనికులకు మరణానంతరం గత సంవత్సరం గౌరవ బిరుదులు, ఫస్ట్-క్లాస్ మెరిట్ పతకాలను అందజేసింది. ఇక, శీతాకాల ఒలింపిక్స్‌ను భారత్ బహిష్కరించనప్పటికీ.. ప్రారంభ వేడుకలు సహా ఒలింపిక్ కార్యక్రమానికి మన దేశం నుంచి ఎవ్వర్నీ పంపడంలేదు. గాల్వాన్‌లో ఇరు సైన్యాల మధ్య ఘర్షణ జరిగినప్పటి నుంచి దుందుడుకుతనంగా వ్యవహరిస్తున్న చైనా.. మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంది. గాల్వాన్ ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఇదే సమయంలో తమ సైనికులు ఎంతమంది చనిపోయారనేది ఇప్పటికీ చైనా సరిగ్గా వెల్లడించలేదు. అయితే, ఓ కమాండిండ్ ఆఫీసర్, మరో నలుగురు సైనికులు మాత్రమే మరణించారని చెప్పుకుంది. ఘర్షణ జరిగిన ఏడాదిన్నర తర్వాత తిరిగి గాల్వాన్ లోయలో నూతన సంవత్సర సందర్భంగా గాల్వాన్ లోయ నుంచి చైనా సైన్యం తమ జాతీయ జెండాను ఎగురువేసి, శుభాకాంక్షలు తెలిపినట్టు ఓ వీడియోను డ్రాగన్ విడుదల చేసింది. అయితే, భారత్ దీనికి కౌంటర్ ఇస్తూ చైనా కుట్రలను బట్టబయలు చేసింది.


By February 03, 2022 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/galwan-clashes-hurt-cpla-officer-qi-fabao-is-torch-bearer-at-winter-olympics/articleshow/89313457.cms

No comments