Breaking News

దేశంలో సింగిల్-డోస్‌ వ్యాక్సిన్.. స్నుత్నిక్ లైట్‌‌కు డీసీజీఐ ఆమోదం


దేశంలో సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించింది. ఈ టీకాకు అత్యవసర వినియోగం కింద డీసీజీఐ అనుమతించినట్టు కేంద్ర ఆరోగ్యశఆఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. దేశంలో అనుమతి పొందిన 9వ కోవిడ్-19 అని ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. రష్యాకు చెందిన స్పుత్నిక్- వీ వ్యాక్సిన్ ఇప్పటికే భారత్‌లో పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. గతేడాది జూన్ 2వ వారం నుంచి ఈ టీకా భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ సింగిల్ డోస్ ధరను ఖరారు చేస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తుండగా.. దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడం, వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సినేషన్, కొవాగ్జిన్, కొవీషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం సరిపోకపోవడంతో రష్యా టీస్పుత్నిక్- వీకి అత్యవసర వినియోగం కింద కేంద్రం గతేడాది ఏప్రిల్ 12నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా స్పుత్నిక్ లైట్ కోవిడ్ వ్యాక్సిన్‌కు జనవరి 31న డీసీజీఐ అనుమతి ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను భారతదేశంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతినిచ్చింది. స్పుత్నిక్ లైట్ ట్రయల్స్ ఆమోదం కోసం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ టీకా ఇచ్చిన వ్యక్తిలో ఎటువంటి ప్రమాదకరమైన దుష్ప్రభావాలు కనిపించలేదు. దీంతో అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పుత్నిక్-వీ, లైట్ మధ్య అతిపెద్ద వ్యత్యాసం డోస్. స్పుత్నిక్- V అనేది రెండు డోస్‌ల వ్యాక్సిన్‌. అయితే, లైట్ ఒక్క డోస్ తీసుకుంటే సరిపోతుంది. అయితే, రెండింటి ప్రభావం గురించి లాన్సెట్ అధ్యయనం ప్రకారం.. కోవిడ్-19 వైరస్‌కు వ్యతిరేకంగా స్పుత్నిక్ లైట్ కంటే స్పుత్నిక్-వీ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. రెండు డోస్‌ల టీకాలో రెండు వేర్వేరు వెక్టర్‌లు ఉపయోగించారు. కరోనాకు వ్యతిరేకంగా స్పుత్నిక్-వీ ప్రభావం దాదాపు 91.6 శాతం కాగా, స్పుత్నిక్ లైట్ ప్రభావం 78.6 నుంచి 83.7 శాతం మధ్య ఉంటుంది.


By February 07, 2022 at 10:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sputnik-light-single-dose-covid-vaccine-gets-emergency-use-approved-by-dcgi-in-india/articleshow/89396801.cms

No comments