Breaking News

ఇస్రో పీఎస్ఎల్వీ-సీ52 ప్రయోగం సక్సెస్.. నిర్దేశిత కక్ష్యలోకి మూడు ఉపగ్రహాలు


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ () పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 ద్వారా నింగిలోకి మూడు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి సోమవారం ఉదయం చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమయ్యింది. మొత్తం 25.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ఉదయం 5.59 గంటలకు వాహకనౌక ఆర్‌ఐశాట్‌-1, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ప్రయోగ కేంద్రం నుంచి బయలు దేరిన 18.31 నిమిషాల తర్వాత ఈ మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టినట్టు ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ ప్రకటించారు. శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ ఏడాదిలో ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఇదే కాగా... ఇస్రో అధిపతిగా ఇటీవల నియామకమైన డాక్టర్‌ సోమనాథ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి ప్రయోగం కావడం విశేషం. ఇస్రో రేసుగుర్రం పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక విజయవంతంగా 54వసారి నింగిలోకి దూసుకెళ్లింది. ‘భూపరిశీలన ఉపగ్రహాలు ఈఓఎస్-4ను భూమికి 529 కిలోమీటర్ల ఎత్తున నిర్దేశిత కక్ష్యలో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ ఫిబ్రవరి 14,2022న ఉదయం 6.17 గంటలకు ప్రవేశపెట్టింది.. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని ఒకటో ప్రయోగ కేంద్రం నుంచి 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఉదయం 5.59 గంటలకు రాకెట్ ప్రయాణం ప్రారంభించి.. 18 నిమిషాల తర్వాత లక్ష్యాన్ని చేరింది.. షార్ నుంచి ప్రయోగించిన 80వ మిషన్ కాగా.. పీఎస్ఎల్వీలో 54వది..’ అని ఇస్రో ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇస్రో ప్రయోగించిన మూడూ ఉపగ్రహాల్లో ఆర్‌ఐశాట్‌-1 అతిపెద్దది. మొత్తం 1,710 కిలోల బరువుండే ఈ ఉపగ్రహం కాల పరిమితి పదేళ్లు. ఈ ఉపగ్రహం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. రేయింబవళ్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా దీనిని రూపొందించారు. ఉపగ్రహంలో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు, అధిక నిల్వ పరికరాలు ఉన్నాయి. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల నిర్వహణ కోసం విలువైన సమాచారం సేకరించడానికి ఈ ఉపగ్రహం ఇమేజింగ్‌ డేటా ఉపయోగపడనుంది. రెండోది ఐఎన్‌ఎస్‌-2టీడీ ఉపగ్రహాన్ని భారత్‌, భూటాన్‌ సంయుక్తంగా రూపొందించారు. 17.5 కిలోల బరువుండే ఈ ఉపగ్రహ జీవితకాలం ఆరు నెలలు. భవిష్యత్తులో సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్‌ కోసం రూపొందించారు. విశ్వవిద్యాలయాల విద్యార్థులు తయారుచేసిన ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహం బరువు 8.1 కిలోలు. ఏడాది జీవితకాలం ఉండే ఈ ఉపగ్రహాన్ని తక్కువ భూకక్ష్యలో ఉంచారు. భూమి అయానోస్పియర్‌ అధ్యయనం నిమిత్తం కాంపాక్ట్‌ అయానోస్పియర్‌ ప్రోబ్‌ అమర్చి ఉంటుంది. ఈ ఉపగ్రహాన్ని యూఎస్‌లోని కొలరాడో బౌల్డర్‌ యూనివర్సిటీలోని ల్యాబరేటరీ ఫర్‌ అట్మాస్ఫియరిక్‌ అండ్‌ స్పేస్‌ ఫిజిక్స్‌, నేషనల్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, తైవాన్‌, సింగపూర్‌లోని నాన్యాంగ్‌ టెక్నాలజికల్‌ విశ్వవిద్యాలయం, తిరువనంతపురంలోని ఐఐఎస్‌టీ సహకారంతో రూపకల్పన చేశారు.


By February 14, 2022 at 07:22AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isro-successfully-places-three-satellites-in-orbit-through-pslv-c52-rakcet-eos-03-mission/articleshow/89555388.cms

No comments