Breaking News

45 వేల కంటే తక్కువగా కోవిడ్ కేసులు… 3.17 శాతానికి పడిపోయిన పాజిటివిటీ రేటు


భారత భారీగా తగ్గాయి. 50 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. దాంతో పాటు పాజిటివిటీ రేటు కూడా పడిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 44,877 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 11 శాతం తక్కువ. రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉంది. అలాగే వైరస్ బారి నుంచి కొత్తగా 1,17,591 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 4,26,31,421 కరోనా కేసులున్నాయి. యాక్టివ్ కేసులు 5,08,665 ఉన్నాయి. 4,15,85,711 మంది కోవిడ్ భారి నుంచి కోలుకున్నారు. ఈ లెక్కన యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.43 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.37 శాతానికి చేరిందని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోపక్క దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 172.81 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించారు. ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు ఇస్తున్నారు. ఇక 15 ఏళ్ల నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కరోనా టీకాలు వేయడం గత నెలలో ప్రారంభమైంది. అలాగే 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్‌లను నిపుణుల బృందం నుంచి కేంద్రం సిఫారసు చేసిన వెంటనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవియా శనివారం తెలిపారు.


By February 13, 2022 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-logs-44877-covid-cases-with-in-24-hours-daily-positivity-rate-drops-to-3-17-percent/articleshow/89539178.cms

No comments