4 నెలల తర్వాత లఖింపుర్ ఖేరి కేసు నిందితుడు ఆశిష్ మిశ్రా విడుదల
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడైన మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడైన ఆశిష్‌కు గురువారం అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన జైలు నుంచి బయటకొచ్చారు. ఈ సందర్భంగా ఆశిష్ మిశ్రా బెయిల్ మంజూరు విషయంలో రూ.3 లక్షల చొప్పున ఇద్దరి నుంచి ష్యూరిటీ సమర్పించాలని కోర్టు ఆదేశించిందని ఆశిష్ తరఫు లాయర్ చెప్పారు. అలాగే ఊరు దాటి వెళ్లే విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించలేదని తెలియజేశారు. గత అక్టోబర్ 10వ తేదీన ఆశిష్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా దొరకలేదు. నాలుగు నెలల అనంతరం బెయిల్ మంజూరవ్వడంతో బయటకొచ్చారు. అయితే ఆశిష్ విడుదల సందర్భంగా ముందు మార్గం నుంచి కాకుండా జైలు వెనుక గేటు నుంచి బయటకు వచ్చి, అనంతరం వాహనంలో వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. అక్టోబర్‌లో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు శాంతియుత నిరసన ప్రదర్శనలు చేస్తుండగా వారిని వాహనాలతో ఢీకొట్టారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఘటనలో పలువురు రైతులు కూడా చనిపోవడంతో ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. కాగా ఆశిష్ విడుదలపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్, ఆరెల్డీ, త్రుణమూల్, పీడీపీ పార్టీల నేతలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
By February 16, 2022 at 09:34AM
No comments