Breaking News

Ramesh Babu Ghattamaneni : అన్న‌య్య చివ‌రి చూపుకు నోచుకోకుండానే .. మ‌హేష్ బాబుకి క‌రోనా క‌ష్టం!


కృష్ణ పెద్ద కుమారుడు, హీరో మ‌హేష్ అన్న‌య్య ర‌మేష్ బాబు ఘ‌ట్ట‌మ‌నేని శ‌నివారం రాత్రి అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆదివారం ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ ర‌మేష్ బాబు అంత్య‌క్రియ‌ల‌ను ఆదివారం మ‌ధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మ‌హా ప్ర‌స్థానంలో నిర్వ‌హించనున్నారు. ముందుగా ఆయ‌న భౌతిక కాయాన్ని కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల సంద‌ర్శ‌నార్ధం ప‌ద్మాల‌యా స్టూడియోలో కొంత‌సేపు ఉంచుతారు. కోవిడ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టం కార‌ణంగా అభిమానులు ఎక్కువ‌గా గుమిగూడ‌కుండా ఉండాల‌ని, కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ రిక్వెస్ట్ చేసింది. అయితే రీసెంట్‌గానే మ‌హేష్ బాబుకి క‌రోనా పాటిజివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఆయ‌న ఐసోలేష‌న్ ఉంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి. ఆయ‌నెంతో ఇష్ట‌ప‌డే అన్న‌య్య‌ను చివ‌రి చూపు కూడా చూసుకోలేని ప‌రిస్థితి క‌రోనా వ‌ల్ల క‌లిగింది. మ‌హేష్ కోవిడ్ పాజిటివ్ కార‌ణంగా ఇంటికే ప‌రిమితం అవుతార‌ట‌. ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త .. పిల్ల‌లు ర‌మేష్ బాబు పార్థీవ దేహాన్ని సంద‌ర్శిస్తార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మ‌హేష్‌కు అన్న‌య్య ర‌మేష్ అంటే ఎంతో అభిమానం. ఆయ‌న‌తో క‌లిసి కొన్ని జ‌బార్ రౌడీ, ముగ్గురు కొడుకులు వంటి సినిమాల్లోనూ న‌టించారు. ఇక ర‌మేష్ బాబు సినీ ప్ర‌స్థానానికి వ‌స్తే.. ఆయ‌న ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో యువ అల్లూరి పాత్ర‌లో క‌నిపించి సినీ రంగ ప్ర‌వేశం చేశారు. ఆ త‌ర్వాత మరి కొన్ని చిత్రాల్లోనూ న‌టించారు. ‘సామ్రాట్’ చిత్రంతో హీరోగా మారారు. కెరీర్ ప్రారంభంలో బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు వంటి చిత్రాలు రమేష్ బాబుకు మంచి పేరుని తెచ్చి పెట్టాయి. తర్వాత ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో సినిమా రంగానికి హీరోగా దూర‌మ‌య్యారు. కృష్ణ న‌టించిన ఎన్‌కౌంట‌ర్ సినిమాలో కీల‌క పాత్ర‌ను పోషించారు. ఆ త‌ర్వాత ఆయ‌న న‌ట‌న‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారారు. తండ్రి పేరు మీద‌నే కృష్ణ ప్రొడ‌క్ష‌న్స్‌ను స్టార్ట్ చేశారు. దూకుడు, ఆగ‌డు చిత్రాల‌కు ర‌మేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు


By January 09, 2022 at 09:53AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-could-not-see-his-brother-rameshbabu-last-glance-due-to-corona/articleshow/88786301.cms

No comments