Breaking News

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్


దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత పది రోజులుగా రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురిచేస్తుండగా.. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రాజకీయ నేతలు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కేజ్రీవాల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది... స్వల్ప లక్షణాలు ఉన్నాయి.. హోం ఐసోలేషన్‌లో ఉన్నాను.. కొద్ది రోజులుగా తనను కలిసినవారు ఐసోలేషన్‌లోకి వెళ్లి కోవిడ్ పరీక్షలను చేయించుకోవాలి’ అని కేజ్రీవాల్ సూచించారు. మరోవైపు, ఢిల్లీలో కొత్తరకం వేరియంట్ సహా రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నా కోవిడ్ కేసులు ఆగడంలేదు. ప్రస్తుతం దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 6 శాతం దాటినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సోమవారం ఢిల్లీలో ఏకంగా 4,099 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోల్చితే ఇది 28 శాతం అధికం. ఆదివారం 4.59 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు (3,194 కేసులు).. సోమవారానికి 6.46 శాతానికి చేరింది. దీంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) అధికారులు మంగళవారం అత్యవసరంగా సమావేశమై కోవిడ్ కఠిన ఆంక్షలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలో 2,087 కంటెయిన్‌మెంట్ జోన్లను ఏర్పాటుచేయగా.. ఆస్పత్రుల్లో చేరే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం 307 మంది ఆస్పత్రిలో చేరగా.. సోమవారం 420 మంది ఆస్పత్రుల్లో చేరినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఢిల్లీలో గత రెండు రోజులుగా నమోదయిన కొత్త కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌ బాధితులే ఉన్నారని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం 351 నిర్ధారణ అయ్యాయి.


By January 04, 2022 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-chief-minister-arvind-kejriwal-tests-positive-for-covid-19/articleshow/88679443.cms

No comments