Breaking News

సీడీఎస్ రావత్ ఫ్లైట్ క్రాష్‌పై నివేదిక.. వాతావరణంలో మార్పులే కారణం


సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రాథమిక అందింది. ఘటన ఎలా జరిగిందనేదానిపై ఈ నివేదిక ఒక స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 8, 2021న జరిగిన ప్రమాదంపై దర్యాప్తు కోసం త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వాయుసేన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దర్యాప్తు జరిపి దానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్‌కు సాంకేతిక వైఫల్యం, కుట్ర, నిర్లక్ష్యం, పైలట్ తప్పిదం కారణాలు కావని నివేదికలో పేర్కొంది. వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల ఈ ప్రమాదం సంభవించిందని కమిటీ నివేదికలో తెలిపింది. ఆ టైంలో పరిస్థితిని అంచనా వేయడంలో పైలట్ అయోమయానికి గురయ్యారని, దాంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని పేర్కొంది. ప్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్‌లో నమోదైన సమాచారంతో పాటు, ఘటనా స్థలంలో సేకరించిన వివరాలను పరిశీలించి ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. కాగా ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆ కమిటీ కొన్ని సిఫార్సులు కూడా చేసింది. తమిళనాడులోని కూనూర్ సమీపంలో 2021 డిసెంబర్ 8న హెలికాప్టర్ నేలకూలింది. ఈ సంఘటనలో భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది దుర్మరణం చెందారు. ఈ యాక్సిడెంట్‌లో బిపిన్ రావత్‌ భార్య మధులిక రావత్ చనిపోయారు. వెల్లింగ్టన్ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.


By January 15, 2022 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cds-gen-rawat-chopper-crashed-due-to-unexpected-cloudy-weather/articleshow/88909736.cms

No comments