నేటి నుంచే తమిళనాడులో కఠిన ఆంక్షలతో లాక్‌డౌన్: స్టాలిన్ సర్కారు ప్రకటన
తమిళనాడులో కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ సహా సాధారణ పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మళ్లీ లాక్‌డౌన్ నిబంధనల్ని అమలులోకి తీసుకొచ్చింది. జనవరి 10 వరకూ ఇవి అమల్లో ఉంటాయని ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో శుక్రవారం అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసిన సీఎం స్టాలిన్.. రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్ష జరిపారు. తాజా నిబంధనల ప్రకారం సినిమా థియేటర్లు, మెట్రోరైళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్‌లను 50 శాతం మందిని మాత్రమే అనుమతించనున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో సాధారణ కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలో గత వారం వరకూ వందలోపు ఉన్న పాజిటివ్ కేసులు.. ఒక్కసారిగా పెరిగి 1100కి చేరాయి. అదే సమయంలో నిన్న ఒక్కరోజే 76 ఒమిక్రాన్ కేసులు నమోదుకావడంతో మొత్తం బాధితుల సంఖ్య 120కి చేరుకుంది. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలను అమలు చేయాలని మహారాష్ట్ర, తమిళ నాడు సహా ఎనిమిది రాష్ట్రాలకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడులో డిసెంబరు 15న విధించిన లాక్‌డౌన్ శుక్రవారం రాత్రితో ముగియండగా.. ఆంక్షలను పొడిగించే విషయమై స్టాలిన్ అధికారులతో సమగ్రంగా చర్చించారు. అనంతరం కొత్త నిబంధనలతో లాక్‌డౌన్ ఆంక్షలు తీసుకొచ్చారు. తొమ్మిది ఆపై తరగతుల వారికే నిబంధనల మేరకు తరగతులు నిర్వహిస్తారు. ఆలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర ప్రార్థనాలయాలకు భక్తులను అనుమతిస్తారు. పార్కులు, వినోద స్థలాలు, జిమ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, వసతిగృహాల్లో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు 100 మందికి.. అంత్యక్రియలకు 50 మందికి అనుమతి వస్త్రాలు, నగల దుకాణాల్లో ఒకే సమయంలో 50 శాతం కస్టమర్లకు మాత్రమే అనుమతి మెట్రో రైళ్లు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, ఇండోర్‌స్టేడియంలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో 50 శాతం మందికి అనుమతి ఎగ్జిబిషన్లు, పుస్తక ప్రదర్శనలు 10 రోజులపాటు వాయిదా వేశారు. సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది.
By January 01, 2022 at 10:29AM
No comments