ATM దొంగతనం పక్కా.. హరీష్ శంకర్‌తో దిల్ రాజు పర్ఫెక్ట్ ప్లాన్


టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటంతో క్రమంగా వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ థియేటర్లపై పడటం వెబ్ సిరీస్‌లకు, ఓటీటీ వేదికలకు వరంగా మారింది. దీంతో బడా దర్శకనిర్మాతలు సైతం వెబ్ సిరీస్‌లు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ దర్శకనిర్మాతలు హరీష్ శంకర్- ఓ పర్ఫెక్ట్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నారు. ATM అనే పేరుతో క్రైమ్ వెబ్ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు హరీష్ శంకర్- దిల్ రాజు. దీన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో స్ట్రీమ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన ఈ కాంబో ఈ సారి ATM అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వేదికపై మ్యాజిక్ చేసేందుకు స్కెచ్చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇస్తూ కొత్త పోస్టర్ వదిలారు. ‘రాబరీ బిగిన్స్ సూన్’ (దోపిడీ త్వరలో మొదలు కాబోతుంది) అంటూ ఆ పోస్టర్‌పై రాసిన లైన్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ విషయమై ఇప్పటినుంచే కేర్ తీసుకుంటున్న .. 'దొంగతనం పక్కా' అంటూ చాలా డిఫరెంట్ వేలో ఈ వెబ్ సిరీస్ అనౌన్స్ చేశారు. దిల్ రాజు, హరీశ్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి సంయుక్త నిర్మాణంలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌కి చంద్ర మోహన్ దర్శకత్వం వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అతిపెద్ద దొంగతనం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందట. నటీనటులు, ఇతర వివరాలను అతిత్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.
By January 28, 2022 at 10:29AM
Post Comment
No comments