Breaking News

కొత్తగా 2.71 లక్షల మందికి కోవిడ్.. 7,743కి చేరిన ఒమిక్రాన్ కేసులు


దేశంలో కొత్తగా 2,71,202 మందికి కోవిడ్ వైరస్ సోకింది. కరోనాతో 214 మంది చనిపోయారు. 1,38,331 మంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసులు 15,50,377 ఉన్నాయి. మరోవైపు కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7,743కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది. గత రెండు, మూడు వారాలుగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠినమైన ఆంక్షలను అమలు చేయడమే కాకుండా ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగా శనివారం 66,21,395 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,76,15,454కు చేరింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. అన్ని దేశాలతో కలపి 20 లక్షలకుపైగా కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి. మరోవైపు అమెరికాలో కరనా కల్లోలం సృష్టిస్తోంది. అక్కడ కొత్తగా 4,02,735 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 882 మంది మరణించారు. ఇక ఫ్రాన్స్‌లో కూడా డెల్టాతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. అక్కడ కొత్తగా 324,580 లక్షల కేసులు నమోదయ్యాయి. 148 మంది మృతి చెందారు. వీటితో పాటు రష్యా, ఇటలీ, బ్రిటన్, అర్జెంటీనా దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.


By January 16, 2022 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-records-271202-new-covid-cases-with-314-deaths-in-last-24-hours/articleshow/88927425.cms

No comments